నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి మీరెవరు? కన్నీటి పర్యంతమైన మంత్రి రోజా

Date:

Share post:

Minister Roja Emotional on Bandaru Satyanarayana Comments: టీడీపీ నేత బండారు సత్యనారాయణ, వైసీపీ మంత్రి ఆర్కే రోజా పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో వైసీపీ మంత్రి ఆర్కే రోజా… బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పై స్పందిస్తూ తీవ్ర దిగ్బ్రాంతికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

వైసీపీ మంత్రి ఆర్కే రోజా మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… బండారు సత్యనారాయణ ఎంతో నీచంగా మాట్లాడారని… మీ ఇంట్లో మహిళల గురించి ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా? అని మంత్రి రోజా ప్రశ్నించారు.

రాజకీయాల్లోకి రావాలంటే మహిళలు భయపడుతున్నారు:

బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చెప్పాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇటువంటి నేతను రాజకీయాల్లో ఉండడం వాళ్ళ మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడుతున్నారు అని మంత్రి రోజా తెలిపారు.

సిగ్గులేకుండా లోకేష్ మద్దతు:

రాజకీయాల్లో ఉన్న మహిళ గురించి ఇంత అసభ్యకరంగా మాట్లాడితే… రాజకీయాల్లో ముందుకు రావాలి ఏ మహిళ అయినా అసలు అని అనుకుంటుందా అని రోజా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా నారా లోకేష్ తీరు పై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకి మద్దతుగా నిన్న నారా లోకేష్ సిగ్గు లేకుండా ట్వీట్ చేసారని రోజా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలని సమర్ధించడం సబబు కాదు అన్నారు.

నా క్యారెక్టర్ ను మీరెలా డిసైడ్ చేస్తారు:

నేను బ్లూ ఫిలిమ్స్ లో నటించానని అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో సీడీలు కూడా చూపించారు. కానీ ఎన్నడూ వాటిని నిరూపించలేకపోయారు. ఒక మహిళ ఎలా అయినా బతకొచ్చని సుప్రీంకోర్టే చెప్పింది. నా క్యారెక్టర్ ను డిసైడ్ చేయడానికి మీరెవరు అసలు అని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

అంతే కాకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై పరువు నష్టం దావా వేసి కోర్టుకి ఈడుస్తా అని మంత్రి రోజా హెచ్చరించారు.

టీడీపీ ని వదిలిన టార్చర్ తగ్గలేదు:

తెలుగు దేశం పార్టీ కోసం తాను పది సంవత్సరాలు పనిచేసిన… రాజకీయంగా ఎంతో నష్టపోయానని మంత్రి రోజా తెలిపారు. అంతే కాకుండా పార్టీలో అవమానాలు తట్టుకోలేక బయటకి వచ్చేసినా… ఇంకా నన్ను వేధిస్తూనే ఉన్నారు అని రోజా వాపోయారు.

Minister Roja Emotional on Bandaru Comments:

ALSO READ: చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర భద్రతను (Chandrababu Naidu Security Increased) పెంచింది....

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..!

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేయనునట్లు తెలుస్తోంది. (YS Sharmila contesting as...