పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జగన్. మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడంకాదు అంటూ పోలీసులను ఉద్దేశించి వైఎస్ జగన్ వార్నింగ్ (YS Jagan Serious Warning to AP Police) ఇచ్చారు. వైఎస్ జగన్ పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెడలో నల్ల కండువాలు ధరించిన అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం ‘సేవ్ డెమొక్రసీ’ అని నినాదాలు చేశారు. అయితే ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు… వారి నుంచి ప్లకార్డులు లాక్కునేందుకు ప్రయత్నించినట్లు జగన్ తెలిపారు.
ఇదే క్రమంలో పోలీసుల వైఖరిపై జగన్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కునే అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులను జగన్ నిలదీశారు. మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో… ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. పోలీసుల టోపీల మీద సింహాలకు అర్ధం అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడానికి కాదని… ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఉన్నారని గుర్తుపెట్టుకోండి అంటూ అగ్రం వ్యక్తం చేసారు.
వైఎస్ జగన్ వార్నింగ్ (YS Jagan Serious Warning to AP Police):
మధుసూధన్ రావు గుర్తు పెట్టుకో.. ఎల్లకాలం ఇలాగే ఉండదు..
పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జగన్
అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు.. నీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకి అర్ధం ఏంటో తెలుసా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మీరున్నారు. pic.twitter.com/RBIIn6Ipkx
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2024
ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవరాక్షన్
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకుని.. వారి చేతిలో ఉన్న ప్లకార్డులను పోలీసులు చించివేత
పోలీసుల తీరుపై @ysjagan గారు ఆగ్రహం. pic.twitter.com/3GDrmvKFiA
— YSR Congress Party (@YSRCParty) July 22, 2024
అసెంబ్లీకి జగన్…
పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి!#jagan #amaravati pic.twitter.com/x3A0lJo56B
— Telugu360 (@Telugu360) July 22, 2024