వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం… ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి మూడు రోజులు పాటు అక్కడ ఉండనున్నట్లు తెలుస్తోంది. రేపు ఢిల్లీలో జరిగే ధర్నాలో పాల్గొననున్న (YSRCP Protest – YS Jagan Delhi Tour) వైఎస్ జగన్.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి అని. వైసీపీ శ్రేణుల దాడుల పట్ల నిరసనగా ఈ నెల 24 నుంచి ఢిల్లీ లో జగన్ ధర్నా చేయనున్నారు. అంతేకాకుండా ప్రధానిని, హోమ్ మంత్రిని మరియు రాష్ట్రపతిని కూడా కలిసి ఈ విషయం పట్ల ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం జగన్ ఇప్పటికే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరినట్లు తెల్సుతోంది.
ఈ మేరకు జగన్ తన అధికారిక ట్విట్టర్ (X) ద్వారా ఒక పోస్ట్ చేశారు. “చంద్రబాబు ఆటవిక పాలనకు నిరసనగా బుధవారం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్రంలో 45 రోజుల్లో క్షీణించిన శాంతిభద్రతల అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్తాం. అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, హోంమంత్రి శ్రీ అమిత్‌షా అపాయింట్‌మెంట్లుకూడా కోరాం. అనుమతి రాగానే రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులను వారికి వివరిస్తాం” అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు.
ఢిల్లీకి వైఎస్ జగన్ (YSRCP Protest – YS Jagan Delhi Tour):
చంద్రబాబు ఆటవిక పాలనకు నిరసనగా బుధవారం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్రంలో 45 రోజుల్లో క్షీణించిన శాంతిభద్రతల అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్తాం. అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, హోంమంత్రి శ్రీ అమిత్‌షా అపాయింట్‌మెంట్లుకూడా కోరాం.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2024
నేడు ఢిల్లీకి జగన్, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. రేపు ఢిల్లీలో జరిగే ధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్.. 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండేలా మాజీ సీఎం జగన్ షెడ్యూల్. #YSJagan #Delhi #YSRCP #TeluguNews #AndhraPradesh
— NTV Breaking News (@NTVJustIn) July 23, 2024
ALSO READ: Video: పోలీసులకు వైఎస్ జగన్ వార్నింగ్