భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri Lanka Beat India in 3rd ODI0 ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచుల ODI సిరీస్ ను శ్రీలంక 2 -0 తో సొంతం చేసుకుంది. అంతేకాకుండా శ్రీలంక 27 ఏళ్ళ తరువాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో భారత్‌ను ఓడించింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు 248 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్లు నిశంక (45 పరుగులు), ఫెర్నాండో (96 పరుగులు) మరియు వన్ డౌన్ లో వచ్చిన కుషాల్ మెండిస్ (59 పరుగులు) చేయడంతో శ్రీలంక జట్టు ఒకదశలో భారీ స్కోర్ చేసే దిశలో దూసుకుపోయింది.
అయితే శ్రీలంక బ్యాటర్ల వేగానికి భారత్ బౌలర్లు బాగానే అడ్డుకట్ట వేశారు అనే చెప్పాలి. రియాన్ పరాగ్ మూడు వికెట్లతో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేయగా…అక్షర్, సిరాజ్, సుందర్, కుల్దీప్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.
తదుపరి 249 పరుగుల లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన భారత్… ఓపెనర్ రోహిత్ శర్మ మినహా తక్కినవారెవ్వరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చెయ్యలేదు అనే చెప్పుకోవాలి. ప్రత్యర్థి శ్రీలంక జట్టు స్పిన్ బౌలర్లకు భారత్ బ్యాటర్లు కుదేలయ్యారు. అయితే ఆఖరులో సుందర్ కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారత్ జట్టు ఓటమి అప్పటికే లాంఛనంగా మారిపోయింది.
దీంతో 26 .1 ఓవర్లలో భారత్ 138 పరుగులు మాత్రమే చేసి అల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో విజయంతో శ్రీలంక 2 -0 తేడాతో వన్ డే సిరీస్ ను గెలిచింది. ఇదిలా ఉండగా భారత్ శ్రీలంక మధ్య జరిగిన టీ20 సిరీస్ ను భారత్ దక్కించుకోగా… ఆ తరువాత జరిగిన వన్ డే సిరీస్ ను శ్రీలంక దక్కించుకుంది.
భారత్ చిత్తు (Sri Lanka beat India in 3rd ODI):
Sanath Jayasuriya – the man who helps Sri Lanka write history.
– After 27 long years Sri Lanka beat India in a bilateral ODI series. 🤯 pic.twitter.com/BAIKfXiAtN
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 7, 2024
INDIA LOSE THEIR FIRST ODI SERIES AGAINST SRI LANKA IN 27 YEARS….!!!! pic.twitter.com/L588dK19is
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 7, 2024
Champions 🇱🇰🏆#SriLanka produced another dominant performance with the ball to beat India comprehensively in the third and final ODI #SLvIND to complete a 2-0 series win, their first over India since 1997.
After 27 years of not beating India in an ODI series, the hosts… pic.twitter.com/uj8pV8fEjl
— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) August 7, 2024