Liberia Fuel Tanker Explosion: లైబీరియాలోని టొటోటాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడి పేలిన ఘటనలో సుమారు 40 మంది మృతి చెందినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరో 83 మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారుల సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి… సహాయక చర్యలు చేపట్టారు.
ట్యాంకర్ బోల్తా పడడంతో దెబ్బతిన్న ట్యాంకర్ లో ఉన్న పెట్రోల్ లీక్ అవ్వడం ప్రారంభమైంది. దీంతో లీక్ అవుతున్నపెట్రోల్ ను తీసుకునేందుకు స్థానికులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని ట్యాంకర్‌లో నుంచి పెట్రోల్ తీసుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ ట్యాంకర్ (Liberia Fuel Tank Explosion) నుంచి మంటలు వ్యాపించడం జరిగింది. ఉన్నటుంది ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న వారంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం సూచించింది. అయితే గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియపరుస్తున్నారు.
లైబీరియాలో ఘోర ప్రమాదం (Liberia fuel tanker explosion):
At least 40 people have d!ed in Totota, Lower Bong County, Liberia, after attempting to siphon fuel from an overturned tanker. Many of the residents who had gathered at the scene sustained injuries.
V!EWER D!SCRETION IS ADVISED ⚠️ pic.twitter.com/l4hl0zJ0ak
— EDHUB🌍ℹ (@eddie_wrt) December 28, 2023