Morocco Earthquake: శుక్రవారం రాత్రి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో ఇప్పటి వరకు సుమారు 300మందికి పైనే ప్రజలు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11:00 గంటలకుమొరాకోలోని మరాకేష్ నగరంలో భూకంపం ఏర్పడి భారీ విధ్వంసాన్ని సృష్టించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే, భూకంపం రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదయిందని తెలియజేస్తోంది.
ఈ భూకంపం ధాటికి పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలిపోయాయి. ప్రజలు ప్రాణ భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఘటనానంతరం రెస్క్యూ టీమ్ తో పాటు స్థానికులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కూలిపోయిన భవనాల శిథిలాల కింద చాలా మంది ప్రజలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని అధికారుల చెబుతున్నారు.
Morocco Earthquake:
🚨 #BREAKING 🌍🏢 | A powerful #earthquake shook #Marrakech, Morocco, leaving this building in ruins. 📢 Our thoughts are with the people affected by this natural disaster. Stay safe, Morocco. 💔 #MoroccoEarthquake #StayStrongMorocco#Morocco pic.twitter.com/at4Oi8PARG
— Globe Data Digest (@globedatadigest) September 9, 2023
🚨Breaking: Footage of a building collapsing after the recent earthquake in Morocco🇲🇦
Over 200 feared to have lost their Lives. #prayforMorocco
pic.twitter.com/6n6wvC7i4m— $K 🇬🇭 (@KobbySmyles) September 9, 2023
మొరాకో భూకంపం ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు.
Modi Tweet:
Extremely pained by the loss of lives due to an earthquake in Morocco. In this tragic hour, my thoughts are with the people of Morocco. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. India is ready to offer all possible assistance to…
— Narendra Modi (@narendramodi) September 9, 2023
ALSO READ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, తెదేపా లో ఉద్రిక్తత