ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో భాగంగా సీఎం జగన్ తన సొంత చెల్లి వైఎస్ షర్మిలపై చేసిన విమర్శలపై షర్మిల స్పందించారు.
తాను కట్టుకున్న చీర గురించి రాజకీయ వేదికపై సీఎం జగన్ సభలో మాట్లాడటం దారుణంమని వైఎస్ షర్మిల తెలిపారు. సొంతచెల్లెలు వేసుకున్న బట్టలపై సభలో మాట్లాడుతారా? ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు! ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏం ఉంది?. నా వొంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే అసలు సభ్యత ఉందని అనుకోవాలా ? అంటూ సీఎం జగన్ పై షర్మిల మండిపడ్డారు.
అంతేకాకుండా నేను పసుపు చీర కట్టుకున్నానని… చందరబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతునని సీఎం జగన్ అంటున్నారు. పసుపు కలర్ బాబు పై గారికి పేటెంట్ రైట్ ఉందా? ఇకపోతే గతంలో సాక్షి ఛానల్ కూడా పసుపు రంగులోనే ఉండేది. పసుపు మంగళకరమైన రంగు. అది టీడీపీ సొంతం కాదు అంటూ షర్మిల చెప్పుకొచ్చారు.
పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్, సొంత చెల్లి వైఎస్ షర్మిలపై చేసిన విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. షర్మిల పసుపు చీర కట్టుకుని, వైఎస్ శత్రువులకు ఆహ్వానించారంటూ సీఎం జగన్ విమర్శించారు. అయితే షర్మిల తన కుమారుడు వివాహ ఆహ్వానంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించడానికి వెళ్ళినసంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలోనే షర్మిల లైట్ ఎరుపు రంగు బార్డర్ ఉన్న పసుపు రంగు చీరను ధరించారు.
కాగా తాజాగా పులివెందుల రాజకీయ సభలో సీఎం జగన్ ఈ చీర అంశం తెరపైకి తీసుకొచ్చారు. పసుపు రంగు చీర కట్టుకుని, వైఎస్ శత్రువులకు ఆహ్వాన పత్రికలు అందించారంటూ ఆనాటి ఘటనను సభలో ప్రస్తావించడం జరిగింది.
Morusupalli Sharmila pai Nippulu Cherigina #YsJagan !! pic.twitter.com/iQfT5nW6nn
— cinee worldd (@Cinee_Worldd) April 25, 2024
షర్మిల ఫైర్ (YS Sharmila Fires on CM Jagan):
ముఖ్యమంత్రి హోదాలో నిండు సభలో వేల మంది మగవాళ్ల మధ్య చెల్లెలి చీర గురుంచి మాట్లాడటం ఇది సభ్యతా ? ఇది సంస్కారమా ? pic.twitter.com/DJ7TjQ4MsN
— YS Sharmila (@realyssharmila) April 26, 2024
ALSO READ: వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు