వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసినట్లుగా తెల్సుతోంది (RGV Vyooham Release Postponed). రాంగోపాల్ వర్మ దర్శకుడిగా దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయాలంటూ టీడీపీ కీలక నేత నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తాజాగా గురువారం విచారణ జరిపింది.
ఇందులో భాగంగా జనవరి 11 వరకు వ్యూహం సినిమాను విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సెన్సార్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది.
ఏపి రాష్ట్ర రాజకీయాల ఆధారంగా చేసుకుని ఆర్.జి. వి తెరకెక్కించిన పొలిటికల్ డ్రామానే ఈ వ్యూహాం సినిమా. ఈ సినిమాని దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. తొలుత ఈ సినిమాను డిసెంబర్ 29ను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావించింది. అయితే ఊహించని రీతిలో చిత్ర యూనిట్ కు షాక్ ఇస్తూ విడుదలకు హై కోర్ట్ బ్రేక్ వేసింది.
వ్యూహం విడుదలకు హై కోర్ట్ బ్రేక్ (RGV Vyooham release postponed):
RGV వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్#Telangana #RGV #Vyooham #HighCourt #NTVNews #NTVTelugu pic.twitter.com/5wXUVwo7U5
— NTV Telugu (@NtvTeluguLive) December 29, 2023
ALSO READ: వైసీపీ లో చేరిన అంబటి రాయుడు