ప్రభాస్ తరువాత సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. మారుతీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న “ది రాజా సాబ్” సినిమా నుంచి నిన్న సాయంత్రం 5:03 గంటలకు గ్లింప్స్ (Prabhas Movie ‘The RajaSaab’ Glimpse Released) విడుదల అయ్యింది. ఈ గ్లింప్స్ లో ప్రభాస్ అందంగా, స్టైలిష్ గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి.
వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10 తారీఖున ఈ సినిమా విడుదల కానున్నట్లు ఈ గ్లింప్స్ లో తెలిపారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత భాగం చిత్రకరణ కూడా అయిపోయింది. ప్రస్తుతం ది రాజా సాబ్ గ్లింప్స్ (RajaSaab Glimpse) సోషల్ మీడియా లో వైరల్ గా మారి ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది.
రాజా సాబ్ గ్లింప్స్ (Prabhas Movie ‘The RajaSaab’ Glimpse Released):
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా… ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రొమాంటిక్ హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిథి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ లు నటిస్తున్నట్లు సినీ వర్గాలు తెలుపుతున్నారు. అయితే ఈ విషయం పట్ల చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.