హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై ఓ యువకుడు విచక్షణారహితంగా దాడి (Sanathnagar Electricity Line Inspector Attacked) చేశాడు. ఈ ఘటనలో విద్యుత్ సిబ్బందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
అయితే విద్యుత్ సిబ్బంది పై యువకుడు దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాలలో వైరల్ గా మారగా… నెటిజన్లు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మీడియా కధనం ప్రకారం… రోజువారి విధులలో భాగంగా లైన్ ఇన్స్పెక్టర్ సాయి గణేష్ సనత్ నగర్ లో పెండింగ్ లో ఉన్న విద్యుత్ బిల్లుల అమౌంట్ ని వసూలు చేసేందుకు వెళ్లినట్లు తెల్సుతోంది. ఈ నేపథ్యంలోనే రాములు ఇంటి వద్దకు వెళ్లి పెండింగ్ బిల్ కట్టమని అడగడం జరిగింది. అయితే పెండింగ్ బిల్ కట్టేందుకు ఇంటి యజమాని నిరాకరించగా… విద్యుత్ సిబ్బంది అతని ఇంటి కరెంటు కనెక్షన్ కట్ చేసినట్లు తెలుస్తోంది.
తన ఇంటికి కరెంటు కనెక్షన్ కట్ చేయడం గమనించిన ఇంటి యజమాని మరియు అంతని కొడుకు మురళీధర్ రావు విద్యుత్ సిబ్బంది పై విరుచుకుపడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే విద్యుత్ సిబ్బంది పై పిడిగుద్దులు గుద్దులు గుద్దుతున్నట్లు వీడియోలో గమనించవచ్చు. దీంతో లైన్ ఇంచార్జి సాయి గణేష్ తీవ్రంగా గాయాలపాలు అయ్యి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు మురళీధర్ ను ఆపే ప్రయాతం చేసిన… అతడు మళ్ళి సాయి గణేష్ పై దాడి చేసేందుకు ప్రయత్నిచినట్లు గమనించవచ్చు. ఘటనపట్ల సమాచారం అందుకున్న పోలీసులు సంఘ్టనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
విద్యుత్ సిబ్బంది పై దాడి (Sanathnagar Line Inspector Attacked):
An #Electricity Dept employee was injured after he was thrashed by a Consumer, for asking to clear pending dues #ElectricityBill, in Motinagar, #Hyderabad.#SanathNagar police registered a case and are investigating.
An #Electricity dept employee was injured after he was… pic.twitter.com/0Wq82Qqf5B
— Surya Reddy (@jsuryareddy) July 19, 2024
హైదరాబాద్ – సనత్ నగర్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద దాడి చేసిన ఓ యువకుడు. pic.twitter.com/fDT3bZWhg3
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2024
ALSO READ: గుజరాత్ లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి