ఆ౦దోళనలో రైతులు చనిపోయినట్లు ఎలా౦టి రికార్డులు లేవు: కే౦ద్ర౦

Date:

Share post:

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా చేస్తున్న నిరసనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉండగా, చనిపోయిన వారి రికార్డు లేదని ప్రభుత్వం ఈ రోజు పార్లమె౦టు సమావేశ౦లో తెలిపి౦ది.

ఆందోళన సమయంలో మరణించిన రైతుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ప్రతిపాదిస్తున్నారా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానంగా, “వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద ఈ విషయంలో ఎటువంటి రికార్డు లేదు, కాబట్టి దానిగురు౦చి ప్రశ్న అవసర౦ లేదు” అని బదులిచ్చి౦ది.

మొన్నటి వర్షాకాల సమావేశాల్లోనూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ మాట్లాడుతూ రైతుల మరణాలకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి రికార్డులు లేవని ప్రకటించారు.

అయితే, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ యాక్సెస్ చేసిన పంజాబ్ ప్రభుత్వ డేటా ప్రకారం, జూలై 20 వరకు, ఆందోళనలో మరణించిన 220 మంది రైతులు/వ్యవసాయ కూలీల వివరాలు ధృవీకరించబడ్డాయి. ఈ 220 మందిలో, మరణించిన 203 (92%) రైతులు/వ్యవసాయ కార్మికులు రాష్ట్రంలోని మాల్వా ప్రాంతానికి చెందినవారు కాగా, 11 (5%) మరణాలు మాజా నుండి మరియు ఆరు (2.7%) మంది దోబా నుండి మరణించారు.

రైతుల‌ నిరసనకు నాయకత్వం వహిస్తున్న ‘సంయుక్త కిసాన్ మోర్చా’, ఆ౦దోళనలో మరణి౦చిన వారి సంఖ్యను 670 మందికి పైగా ఉన్నట్లు తెలియజేస్తు౦ది.

అయితే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మరుసటి రోజు, సదరు రైతు సంఘం… “ఇప్పటి వరకు, ఈ ఉద్యమంలో 670 మందికి పైగా నిరసనకారులు తమ ప్రాణాలను అర్పించారు. మోడీ ప్రభుత్వం అధిక మానవ వ్యయాన్ని గుర్తించడానికి నిరాకరించింది. పార్లమెంటు సమావేశాల్లో అమరవీరులకు నివాళులు అర్పించడంతోపాటు వారి పేరు మీద స్మారక చిహ్నం కూడా నిర్మించాలి” అని పేర్కొ౦ది.

కాగా, నిరసనలో దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలిరోజున కాంగ్రెస్‌ నేత ట్వీట్‌ చేస్తూ, “రైతుల నిరసనలో 700 మంది రైతులు అమరులయ్యారు. వారి బలిదానం గురించి మాట్లాడడ౦ గాని, నివాళులర్పించడం ద్వారా గౌరవించడ౦ గాని ఈరోజు పార్లమెంటులో జరగలేదు అన్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

బీజేపీ లో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

మాజీ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ఇవాళ చెన్నై లో కేంద్ర మంత్రి,...

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపినట్లు సమాచారం (Telangana...

నిడదవోలు జనసేన MLA అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్

జనసేన మరో MLA అభ్యర్థిని ప్రకటించింది. జనసేన, టీడీపీ, బీజేపీ, కూటమిలో భాగంగా నేడు నిడదవోలు (Nidadavole) అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్ధిగా...

నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం...

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి తొలగించాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

బీఆర్ఎస్ పార్టీకి షాక్… నాగర్‌కర్నూల్ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు (Nagarkurnool MP Ramulu...

తెలంగాణలో 17 ఎంపీ స్థానాలలో గెలవడమే బీజేపీ లక్ష్యం: కిషన్ రెడ్డి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గరవుతున్న తరుణంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు...

ప్రముఖ నటి జయప్రద కు అరెస్ట్ వారెంట్

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఊహించని షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్ట్ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్...

దేనికి సిద్ధం జగన్ సార్? : వైఎస్ షర్మిల

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. బాపట్ల నియోజక వర్గంలో జరిగిన కాంగ్రెస్...

బీజేపీ పార్టీకి బాబూమోహన్‌ రాజీనామా

తెలంగాణలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబూమోహన్‌ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా (Babu...

బీజేపీ 350 పైగా ఎంపీ సీట్లను గెలవబోతోంది: బండి సంజయ్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లకు పైగా ఎంపీ సీట్లను గెలవబోతోంది అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ...

కేజ్రీవాల్ కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊహించిన పరిణామం ఎదురయింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్...