Telangana: రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష పేరుతో నిరసన తెలిపనున్నారు (Bandi Sanjay Raithu Deeksha). రేపు అనగా మంగళవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కేంద్రం వద్ద ఉదయం ౧౦ గంటలకు బండి సంజయ్ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టనున్నారు.
మీడియా సమాచారం ప్రకారం… అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందించలేదని బండి సంజయ్ విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీను కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని బండి సంజయ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ‘రైతు దీక్ష’ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.
రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల నిర్వహించనున్న ఈ దీక్షలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొనున్నట్లు సమాచారం.
బండి సంజయ్ రైతు దీక్ష (Bandi Sanjay announced Raithu Deeksha):
రేపు బండి సంజయ్ ‘రైతు దీక్ష'
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని, సాగునీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదని పంటల బీమాపథకాన్ని అమలు చేయలేదని, మంగళవారం కరీంనగర్… pic.twitter.com/zr6TRzxQhb
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2024
ALSO READ: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధా క్రిష్ణన్