జనసేన మరో MLA అభ్యర్థిని ప్రకటించింది. జనసేన, టీడీపీ, బీజేపీ, కూటమిలో భాగంగా నేడు నిడదవోలు (Nidadavole) అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్ధిగా కందుల దుర్గేష్ ను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు (Kandula Durgesh appointed as Nidadavolu Janasena MLA Candidate).
దీంతో మొత్తంగా ఇప్పటికి జనసేన పార్టీ ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. మీడియా సమాచారం ప్రకారం ముందుగా కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ నుంచి పోటీ చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం.
నిడదవోలు అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్ (Kandula Durgesh Nidadavolu Janasena MLA Candidate):
నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన MLA అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారు..#JanaSena #VoteForGlass#BJP #JSP #TDP#APElections2024 pic.twitter.com/yKMWW0zw44
— JanaSena Party (@JanaSenaParty) March 11, 2024
ALSO READ: ముద్రగడ పద్మనాభంపై కేఏ పాల్ ఫైర్