బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాముడికి మొక్కుదాం బీజేపీ ని తొక్కుదాం అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ (KTR Comments on BJP) పిలుపునిచ్చారు. దేవుడిని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ రాజకీయం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ లో బీజేపీ అభ్యర్థులు కరువయ్యారని… బీజేపీ ప్రకటించిన అభ్యర్థులలో చాల మంది తమ పార్టీ నించి వెళ్లిన వారే అంటూ కేటీఆర్ ఎద్దెవా చేశారు. ఒక్క సికిందరాబాద్ నుంచి పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి ఒక్కరే అసలైన బీజేపీ అభ్యర్థి అని ఆయన తెలిపారు. దేశంలో మోదీ హవా అంత బాగుంటే.. ఇతర పార్టీల నుంచి నాయకులను ఎందుకు తీసుకున్నారో చెప్పాలి అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘మాట్లాడితే రాముడికి దండం పెడుదాం.. మోదీకి ఓటు వేద్దాం’ అని అంటున్నారు. హిందువులం కాబట్టి తప్పకుండా రాముడికి దండం పెడుతాం.. కానీ ఓటు వేసే ముందు చేవెళ్లకు బీజేపీ ఏం చేసిందో ఆలోచించాలి అని కేటీఆర్ తెలిపారు.
ఇకపోతే నాలుగు నెలలైనా కేసీఆర్‌ను తిట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఆయన మాట్లాడుతున్నడు అని కేటీఆర్ విమర్శించారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీజేపీలోకి జంప్ అయ్యే మొట్టమొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాముడికి మొక్కుదాం బీజేపీని…. (KTR Comments on BJP):
రాముడుకి మొక్కుదాం బీజేపీ ని తొక్కుదాం : కేటీఆర్ pic.twitter.com/s6brFzL9gE
— V6 News (@V6News) April 3, 2024
ALSO READ: బీఆర్ఎస్ పార్టీకి కడియం శ్రీహరి ద్రోహం చేశారు: హరీష్ రావు