టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu promises AP Volunteers salary to be increased to Rs 10000) పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ… ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎప్పుడు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి వస్తే.. రూ 5000 ఉన్న వాలంటీర్ల జీతాన్ని, నెలకు రూ 10 వేలకు పెంచుతామన్నారు.
రూ. 10,000 పెంచుతాం (Volunteers salary to be increased to Rs 10000):
వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం
టీడీపీ అధికారంలోకి వస్తే రూ. 5000 ఉన్న జీతాన్ని రూ. 10,000 లకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని వారిని కొనసాగిస్తామని తెలిపారు. pic.twitter.com/X0MSULwsrM
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2024
ALSO READ: YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..!