రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా చేస్తున్న నిరసనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉండగా, చనిపోయిన వారి రికార్డు లేదని ప్రభుత్వం ఈ రోజు పార్లమె౦టు సమావేశ౦లో తెలిపి౦ది.
ఆందోళన సమయంలో మరణించిన రైతుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ప్రతిపాదిస్తున్నారా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానంగా, “వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద ఈ విషయంలో ఎటువంటి రికార్డు లేదు, కాబట్టి దానిగురు౦చి ప్రశ్న అవసర౦ లేదు” అని బదులిచ్చి౦ది.
మొన్నటి వర్షాకాల సమావేశాల్లోనూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ మాట్లాడుతూ రైతుల మరణాలకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి రికార్డులు లేవని ప్రకటించారు.
అయితే, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ యాక్సెస్ చేసిన పంజాబ్ ప్రభుత్వ డేటా ప్రకారం, జూలై 20 వరకు, ఆందోళనలో మరణించిన 220 మంది రైతులు/వ్యవసాయ కూలీల వివరాలు ధృవీకరించబడ్డాయి. ఈ 220 మందిలో, మరణించిన 203 (92%) రైతులు/వ్యవసాయ కార్మికులు రాష్ట్రంలోని మాల్వా ప్రాంతానికి చెందినవారు కాగా, 11 (5%) మరణాలు మాజా నుండి మరియు ఆరు (2.7%) మంది దోబా నుండి మరణించారు.
రైతుల నిరసనకు నాయకత్వం వహిస్తున్న ‘సంయుక్త కిసాన్ మోర్చా’, ఆ౦దోళనలో మరణి౦చిన వారి సంఖ్యను 670 మందికి పైగా ఉన్నట్లు తెలియజేస్తు౦ది.
అయితే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మరుసటి రోజు, సదరు రైతు సంఘం… “ఇప్పటి వరకు, ఈ ఉద్యమంలో 670 మందికి పైగా నిరసనకారులు తమ ప్రాణాలను అర్పించారు. మోడీ ప్రభుత్వం అధిక మానవ వ్యయాన్ని గుర్తించడానికి నిరాకరించింది. పార్లమెంటు సమావేశాల్లో అమరవీరులకు నివాళులు అర్పించడంతోపాటు వారి పేరు మీద స్మారక చిహ్నం కూడా నిర్మించాలి” అని పేర్కొ౦ది.
కాగా, నిరసనలో దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజున కాంగ్రెస్ నేత ట్వీట్ చేస్తూ, “రైతుల నిరసనలో 700 మంది రైతులు అమరులయ్యారు. వారి బలిదానం గురించి మాట్లాడడ౦ గాని, నివాళులర్పించడం ద్వారా గౌరవించడ౦ గాని ఈరోజు పార్లమెంటులో జరగలేదు అన్నారు.