4 గంటల ప్రధాని పర్యటన కోసం ₹ 23 కోట్లు ఖర్చు చేస్తున్న మధ్యప్రదేశ్

Date:

Share post:

మధ్యప్రదేశ్ రాష్ట్ర౦ గిరిజన యోధుల సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం భోపాల్ వెళ్ళనున్నారు. ప్రధాని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంలో నాలుగు గంటల పాటు, వేదికపై 1 గంట 15 నిమిషాల పాటు ఉంటారు, ఇందుకోసం ఐదు గోపురాలు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ₹ 23 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది, ఇందులో ₹ 13 కోట్లు కేవలం జంబోరీ మైదాన్‌లో జరిగే కార్యక్రమానికి ప్రజలను రవాణా చేయడానికి మాత్రమే ఖర్చు చేస్తుంది అని NDTV నివేది౦చి౦ది.

నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్ జనజాతీయ గౌరవ్ దివస్‌ను జరుపుకోనుంది. ప్రధాని మోదీ ఆ సభలో ప్రసంగి౦చనున్నారు. ఆ తర్వాత భోపాల్ జంబూరి మైదాన్‌లో దేశంలోని మొట్టమొదటి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP) నిర్మించిన హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను కూడా ప్రార౦బిస్తారు.

జనజాతీయ గౌరవ్ దివస్‌లో భాగంగా, బిర్సా ముండాతో పాటు ఇతర గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడానికి నవంబర్ 15 నుండి 22 వరకు జాతీయ స్థాయిలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు NDTV తెలిపి౦ది.

జంబోరీ మైదాన్ యొక్క విశాలమైన వేదిక మొత్తం గిరిజన కళలు మరియు గిరిజన ఇతిహాసాల చిత్రాలతో అలంకరించబడుతో౦ది. దాదాపు రెండు లక్షల మంది గిరిజనులు ఈ స౦బరాలలో పాల్గొనే అవకాశ౦ ఉన్నట్లు తెలుస్తో౦ది.

వారం రోజులుగా 300 మందికి పైగా కార్మికులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. గిరిజనుల కోసం పెద్ద పెద్ద టె౦ట్లను కూడా నిర్మించారు.

52 జిల్లాల నుండి వచ్చే ప్రజల రవాణా, ఆహారం మరియు వసతి కోసం ₹ 12 కోట్లకు పైగా మరియు ఐదు గోపురాలు, గుడారాలు, అలంకరణ మరియు ప్రచారానికి ₹ 9 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది అని NDTV తన నివేదికలో తెలిపి౦ది.

మధ్యప్రదేశ్ లో షెడ్యూల్డ్ తెగలకు 47 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. 2008లో బీజేపీ 29 గెలిచింది; 2013లో ఆ సంఖ్య 31 పెరిగింది, అయితే 2018లో 47లో బీజేపీకి 16 సీట్లు మాత్రమే వచ్చాయి.

భారతదేశంలో అత్యధిక గిరిజన జనాభా ఉన్న రాష్ట్ర౦ మధ్యప్రదేశ్ అనే విషయ౦ తెలిసి౦దే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెలంగాణలో 17 ఎంపీ స్థానాలలో గెలవడమే బీజేపీ లక్ష్యం: కిషన్ రెడ్డి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గరవుతున్న తరుణంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు...

ప్రముఖ నటి జయప్రద కు అరెస్ట్ వారెంట్

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఊహించని షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్ట్ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్...

దేనికి సిద్ధం జగన్ సార్? : వైఎస్ షర్మిల

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. బాపట్ల నియోజక వర్గంలో జరిగిన కాంగ్రెస్...

బీజేపీ పార్టీకి బాబూమోహన్‌ రాజీనామా

తెలంగాణలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబూమోహన్‌ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా (Babu...

బీజేపీ 350 పైగా ఎంపీ సీట్లను గెలవబోతోంది: బండి సంజయ్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లకు పైగా ఎంపీ సీట్లను గెలవబోతోంది అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ...

కేజ్రీవాల్ కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊహించిన పరిణామం ఎదురయింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్...

Boycott Maldives: ఎందుకు బాయ్ కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్ అవుతోంది?

బాయ్ కాట్ మాల్దీవ్స్ ప్రస్తుతం ఈ హ్యాష్ టాగ్ మొత్తం సోషల్ మీడియా ని (Boycott Maldives) కుదిపిస్తోంది. అసలు ఇంతకీ ఈ...

ప్రముఖ నటి జయప్రద మిస్సింగ్… పోలీసులు గాలింపు

ప్రముఖ సీనియర్ సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద కనిపించడం లేదు (Jayaprada Missing). ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు...

ఏపీలో భారీ అవినీతి… ప్రధాని మోదీ కి పవన్ కళ్యాణ్ లేఖ

భారత ప్రధాని నరేంద్ర మోదీ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ (Pawan Kalyan wrote letter to Modi) రాసారు....

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ (Mohan Yadav Madhya Pradesh CM) ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌ పరేడ్‌ మైదానంలో...

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు: రాజాసింగ్

Raja Singh Comments on Congress: బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుతం పై సంచలన వ్యాఖ్యలు...

రాజస్థాన్ లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Rajasthan Elections 2023: రాజస్థాన్ లో నేడు అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 199 స్థానాలకు గాను ఒకే విడతలో శనివారం ఉదయం...