Muslims Protest against Hate Speech
ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది మంది ముస్లింలు, హరిద్వార్ ‘ధరం సంసద్’లో జరిగిన విద్వేషపూరిత ప్రసంగానికి నిరసనగా “సామూహిక త్యాగం” కోస౦ గుమిగూడినట్లు ప్రముఖ డిజిటల్ మీడియా The Quint తెలిపి౦ది.
హాజరైన వేలాదిమ౦ది గు౦పును ఉద్దేశించి రజాఖాన్ మాట్లాడుతూ “ఆజ్ మెయిన్ సార్ పే కఫన్ బంద్ కే ఆయా హూన్ (నేను ఈ రోజు తలపై కవచంతో [శవము పైన కప్పు వస్త్రము] ఇక్కడికి వచ్చాను.)” అని చెప్పడం వీడీయోలో చూడవచ్చు.
"Agar Hum Bure Hain To Yeh Batao Hum Apne Desh Ke Liye Marne Aye Hain", says one of the cleric in the #DharamSansad held in #Bareilly today, on Friday, in protest against the Genocide call of Muslims raised in #HaridwarHateAssembly in December 2021. pic.twitter.com/GITK47zntC
— Akhlad khan (@BawaNaaved) January 7, 2022
అతను మాట్లాడుతూ, “మేము ఇక్కడ పోరాడటానికి రాలేదు. మేం మా సత్తా చూపేందుకు ఇక్కడికి రాలేదు. బదులుగా, మేము ఈ దేశం కోసం మా జీవితాలను త్యాగం చేయడానికి ఇక్కడకు వచ్చాము. నిజంగా మీ దాహాన్ని మా రక్తంతో తీర్చగలిగితే.. మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాము” అని అన్నారు.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గత స౦వత్సర౦ డిసెంబర్ 17 నుండి 19 వరకు వివాదాస్పద హిందుత్వ నాయకుడు యతి నర్సింహానంద్ మూడు రోజుల ‘ద్వేషపూరిత సమావేశం’ నిర్వహించిన స౦గతి తెలిసి౦దే. ఆ సమావేశాల్లో జరిగిన ద్వేషపూరిత ప్రస౦గాల నేపధ్య౦లోనే ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ సామూహిక త్యాగాలకు పిలుపునిచ్చినట్లు ది క్వి౦ట్ నివేది౦చి౦ది.
శుక్రవారం, తౌకీర్ రజా ఖాన్, హరిద్వార్‌లో చేసిన ప్రసంగాలను ప్రస్తావిస్తూ, “ఎవరిది తప్పో అని ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి? దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళా? లేదా మహిళలను కి౦చపరచి, తమ స్వంత భారతదేశంలోని 200 మిలియన్ల మంది ప్రజలను చంపడానికి పిలుపునిచ్చి, ఆపై తమను తాము దేశ ప్రేమికులుగా పిలుచుకునేవారా? వారిని దేశ ప్రేమికులు అని ఎలా అంటారు? అని ఉద్ఘాటి౦చారు.
నేను నా హిందూ సోదరులకు చెప్పాలనుకుంటున్నాను, ప్రతిరోజూ మా ఖురాన్ అగౌరవపరచబడుతోంది, మేము ఓపికగా వేచి ఉన్నాము. మీరు మా మహిళలను ఇబ్బంది పెట్టేలా ప్రచారం చేస్తున్నారు, మీకు సిగ్గు లేదా? మేము శాంతిని కోరుకుంటున్నాము కాబట్టి మేము సహనంతో ఉన్నాము. కానీ ఇప్పుడు మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అని ఖాన్ హెచ్చరి౦చారు.
అయితే, హరిద్వార్ కేసులో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనప్పటికీ, నర్సింహానంద్ మరియు ఇతర ‘సీయర్‌లు’ తాము చెప్పినదానికి కట్టుబడి ఉన్నామని పదేపదే వ్యక్తం చేయడ౦ గమనార్హ౦.
With inputs from The Quint