వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ న్యూస్ 24 స్పోర్ట్స్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు విరాట్ కోహ్లీ పాకిస్తాన్ రావాలని… అతడి ఆట చూసేందుకు మేము ఎదురు చుస్తునాం అని (Virat Kohli should come to Pakistan for Champions Trophy 2025) యూనిస్ ఖాన్ అన్నారు.
అలాగే కోహ్లి ఇంతవరకు పాకిస్తాన్ లో ఆడలేదు. తన కెరీర్లో పాకిస్థాన్లో పర్యటించడం, పాకిస్థాన్లో ప్రదర్శన చేయడం ఒక్కటే మిగిలి ఉంది. ఇందుకు ఛాంపియన్స్ ట్రోఫీ ఒక గొప్ప అవకాశం కోహ్లీ కి అవకాశం అని భావిస్తున్నానన్నారు.
అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్… పాకిస్తాన్ పర్యటించనుంది లేదా అన్నది ఇంకా ప్రశ్నర్ధకంగానే మిగిలింది. దేనిపై బీసిసి ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు (Virat Kohli should come to Pakistan for Champions Trophy 2025):
Younis Khan said "Virat Kohli should come to Pakistan for the 2025 Champions Trophy, it's our wish too. I think the only thing left in Kohli's career is to tour Pakistan and perform in Pakistan" 🇮🇳🇵🇰🔥🔥
[via News24 Sports] pic.twitter.com/MdBGZafhsX
— Farid Khan (@_FaridKhan) July 24, 2024
ALSO READ: ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు