ఆంధ్ర వాసులకు బాడ్ న్యూస్. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధమయినట్లు (Arogyasri Services Cancelled in AP) సమాచారం. మీడియా సమాచారం ప్రకారం ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా అందించే సేవలను గురువారం అనగా (ఈ నెల 22) నుంచి నిలిపివేయాలని నెట్‌వర్క్ పరిధిలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల అసోసియేషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను చేయించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీ లో రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులకు సుమారు రూ: 2000 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు సమ్మె నోటీసులు ఇవ్వగా… కేవలం రెండు పర్యాయాలు రూ: 300 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం.
ఆరోగ్య శ్రీ సేవలు బంద్ (YSR Arogyasri Services Cancelled in AP):
రేపటి నుండి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్
ఏపీలో దాదాపు 2000 కోట్ల వరకు భారీగా బకాయిలు పేరుకుపోవడంతో రేపటి నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ప్రైవేట్ హాస్పిటల్స్. pic.twitter.com/Hdkd92xL9K
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2023
ALSO READ: టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు