జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh Joins YSRCP) చేరారు. పార్టీలో చేరిన పోతిన మహేష్ కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పాతిన మహేష్ (Pothina Mahesh resigns from Janasena Party) బుధవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు. కూటమిలో విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించడంతో అసంతృప్తి చెందడంతో జనసేన పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో పోతిన మహేష్ తాజాగా వైసీపీలో (Pothina Venkata Mahesh Joins YCP) చేరారు.
పార్టీలో చేరిన సందర్భంగా…. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి (ఎంపీ) గారికి మరియు రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ అయోధ్య రామిరెడ్డి గారికి పోతిన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వైసీపీలో చేరిన పోతిన మహేష్(Pothina Mahesh Joins YSRCP):
cm @ysjagan గారి సమక్షంలో @YSRCParty లో చేరిన పోతిన వెంకట మహేష్. పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీ @yvsubbareddymp గారికి మరియు రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ అయోధ్య రామిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన పోతిన వెంకట మహేష్ గారు pic.twitter.com/oe5ufgetTe
— Pothina venkata mahesh (@pvmaheshbza) April 10, 2024
వైసీపీలో చేరిన జనసేన నేత పోతిన మహేష్
వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించిన ముఖ్యమంత్రి జగన్. pic.twitter.com/LZutXWG2DG
— Telugu Scribe (@TeluguScribe) April 10, 2024