ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసీపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగు దేశం పార్టీ లో చేరారు (Mylavaram YSRCP MLA Vasantha Krishna Prasad Joins TDP).
ఈ మేరకు శనివారం ఉదయం కృష్ణప్రసాద్ హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లడం జరిగింది. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ ను చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దీంతో మైలవరం ఎమ్మెల్యే టికెట్ ను టీడీపీ దేవినేని ఉమకు కాకుండా వసంత కృష్ణప్రసాద్ కు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాను కేవలం వైసీపీ పార్టీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని. దేవినేని ఉమతో తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని… ఇద్దరం కలిసి కూర్చొని అన్నీ మాట్లాడుకుంటామని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు.
టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే (Mylavaram MLA Vasantha Krishna Prasad Joins TDP):
అభివృద్ధిలో ముందుకు సాగాలంటే చంద్రబాబు రావాలి, అందుకే టీడీపీలో చేరాను.!#Vasanthakrishnaprasad #Mylavaram #ChandrababuNaidu #TDP #CMYSJagan #YSRCP #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/pzmGj7b7WT
— NTV Telugu (@NtvTeluguLive) March 2, 2024
హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్. #TDP #chandrababu #AndhraPradesh #APElections2024 #TeluguNews
— NTV Breaking News (@NTVJustIn) March 2, 2024
YSR Congress Mylavaram MLA Vasantha Krishna Prasad joins TDP#TDPJanasena pic.twitter.com/zfqtxKPQsp
— M9 NEWS (@M9News_) March 2, 2024
ALSO READ: మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వెయ్యదు: వైఎస్. సునీతా రెడ్డి