తెలంగాణ: గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు (MLC Kavitha Comments on Group 1 Exam). ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.
“అణగారిన వర్గాల ఆడబిడ్డలకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని కవిత తెలిపారు. గ్రూప్ – 1 నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్లు లేని హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఉంది. దీని వల్ల బిసి, ఎస్సీ, ఎస్టి మహిళలు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది,” అని కవిత చెప్పుకొచ్చారు.
రోస్టర్ పాయింట్లు లేకుండా అసలు మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ల కల్పించగలరా ? 546 గ్రూప్ -1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారు ? అంటూ ప్రశ్నించారు.
రోస్టర్ పాయింట్లను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేసి మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలి అని కవిత ట్వీట్ చేశారు.
మహిళలకు అన్యాయం (MLC Kavitha Comments on Group 1 Exam):
అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కారు తీరని అన్యాయం చేస్తోంది. ఇటీవల జారీ చేసిన గ్రూప్ – 1 నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్లు లేని హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఉంది. దీని వల్ల బిసి, ఎస్సీ, ఎస్టి మహిళలు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
రోస్టర్… pic.twitter.com/D93HazdFrj
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 21, 2024
ALSO READ: తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం