Minister Roja Emotional on Bandaru Satyanarayana Comments: టీడీపీ నేత బండారు సత్యనారాయణ, వైసీపీ మంత్రి ఆర్కే రోజా పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో వైసీపీ మంత్రి ఆర్కే రోజా… బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పై స్పందిస్తూ తీవ్ర దిగ్బ్రాంతికి గురై కన్నీరు పెట్టుకున్నారు.
వైసీపీ మంత్రి ఆర్కే రోజా మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… బండారు సత్యనారాయణ ఎంతో నీచంగా మాట్లాడారని… మీ ఇంట్లో మహిళల గురించి ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా? అని మంత్రి రోజా ప్రశ్నించారు.
రాజకీయాల్లోకి రావాలంటే మహిళలు భయపడుతున్నారు:
బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చెప్పాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇటువంటి నేతను రాజకీయాల్లో ఉండడం వాళ్ళ మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడుతున్నారు అని మంత్రి రోజా తెలిపారు.
సిగ్గులేకుండా లోకేష్ మద్దతు:
రాజకీయాల్లో ఉన్న మహిళ గురించి ఇంత అసభ్యకరంగా మాట్లాడితే… రాజకీయాల్లో ముందుకు రావాలి ఏ మహిళ అయినా అసలు అని అనుకుంటుందా అని రోజా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా నారా లోకేష్ తీరు పై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకి మద్దతుగా నిన్న నారా లోకేష్ సిగ్గు లేకుండా ట్వీట్ చేసారని రోజా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలని సమర్ధించడం సబబు కాదు అన్నారు.
నా క్యారెక్టర్ ను మీరెలా డిసైడ్ చేస్తారు:
నేను బ్లూ ఫిలిమ్స్ లో నటించానని అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో సీడీలు కూడా చూపించారు. కానీ ఎన్నడూ వాటిని నిరూపించలేకపోయారు. ఒక మహిళ ఎలా అయినా బతకొచ్చని సుప్రీంకోర్టే చెప్పింది. నా క్యారెక్టర్ ను డిసైడ్ చేయడానికి మీరెవరు అసలు అని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
అంతే కాకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై పరువు నష్టం దావా వేసి కోర్టుకి ఈడుస్తా అని మంత్రి రోజా హెచ్చరించారు.
టీడీపీ ని వదిలిన టార్చర్ తగ్గలేదు:
తెలుగు దేశం పార్టీ కోసం తాను పది సంవత్సరాలు పనిచేసిన… రాజకీయంగా ఎంతో నష్టపోయానని మంత్రి రోజా తెలిపారు. అంతే కాకుండా పార్టీలో అవమానాలు తట్టుకోలేక బయటకి వచ్చేసినా… ఇంకా నన్ను వేధిస్తూనే ఉన్నారు అని రోజా వాపోయారు.
Minister Roja Emotional on Bandaru Comments:
ఆ రోజు నన్ను చంద్రబాబు ప్రచారానికి ఎందుకు పిలిచాడు.?#AndhraPradesh #YSRCP #MinisterRoja #TDP #ChandrababuNaiduArrest #NTVNews #NTVTelugu pic.twitter.com/HL4SqNitMF
— NTV Telugu (@NtvTeluguLive) October 3, 2023
ALSO READ: చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ