Minister KTR satires Rahul Gandhi: తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పై చేసిన విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీంతో రాహుల్ చేస్తున్న విమర్శలపై తెలంగాణ ఇటి మినిస్టర్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
కేసీఆర్ ది కుటుంబ పాలన అంటూ రాహుల్ విమర్శలు చేస్తున్నారు..మరి కాంగ్రెస్ ది కుటుంబ పాలన కాదా..? అని మంత్రి కేటీఆర్ కౌంటర్ వేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ అంటే బీజేపీకి బీ టీమ్ అంటూ రాహుల్ చేస్తున్న విమర్శలపై కేటీఆర్ మండిపడ్డారు.
మేం బీజేపీకి బీ టీమ్ కాదని కాంగ్రెస్సే సీ టీమ్ అని… సీటీమ్ అంటే చోర్ టీమ్ అంటూ విమర్శించారు. ఏ టూ జెడ్ కుంభకోణాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని…కాంగ్రెస్ అనేది ఓ దగుల్బాజీ పార్టీ అంటూ ఘాటుగా విమర్శించారు. మరియు భూమి నుంచి ఆకాశం వరకు దోపిడీ చేసిన పార్టీ కాంగ్రెస్సే అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిన రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ పార్టీ లో చేరటం ఖాయమని… కాంగ్రెస్ పార్టీని ను రేవంత్ బీజేపీ కి అమ్మేస్తారు అని విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ కి కేటీఆర్ కౌంటర్ (Minister KTR satires Rahul Gandhi):
BRS is not a B Team of BJP.
Congress is a C Team, Chor Team.
A to Z Scams have been done by Congress Leaders.
Your Congress is headed by a Chor in Telangana who was caught redhanded with Cash and is now selling your party tickets – @KTRBRS pic.twitter.com/mjlZWjxHW3— Krishank (@Krishank_BRS) October 19, 2023
ALSO READ: బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య… కాంగ్రెస్ కు షాక్