Harry Porter Dumbledore Passed Away: హ్యారీ పోర్టర్ సిరీస్ అభిమానులకు ఒక విషాద వార్త. ప్రముఖ హాలీవుడ్ నటుడు, హ్యారీ పోటర్ ఫేమ్ సర్ మైఖేల్ గాంబోన్ aka ‘డంబుల్ డోర్‘ కన్నుమూశారు. ప్రస్తుతం అయన వయసు 82 సంవత్సరాలు.
మైఖేల్ గాంబోన్ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో భాద పడుతున్నారు. న్యుమోనియాతో భాదపడుతున్న మైఖేల్ చికిత్స పొందుతూ మరణించినట్లు మైఖేల్ భార్య అన్నే, కుమారుడు ఫెర్గస్‌లు నిర్ధారించారు.
హ్యారీపోటర్ సిరీస్‌తో పాటు మైఖేల్ గాంబోన్ పలు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. అయితే 2004లో గాంబోన్ తొలిసారి హ్యారీ పోటర్‌లో కనిపించారు. ప్రొఫెసర్ ఆల్బన్ డంబుల్ డోర్‌గా అతని నటనతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు.
గాంబోన్ మృతితో హాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. పలువురు హాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
“సర్ మైఖేల్ గాంబోన్‌ను ఇక లేరు అని చెప్పాలంటేనే ఎంతో బాధగా ఉంది. భార్య అన్నే, కుమారుడు ఫెర్గస్‌లు ఆస్పత్రిలో మైఖేల్ బెడ్ వద్ద ఉండగానే అతడు ప్రశాంతంగా మరణించాడు.” అని గాంబోన్ కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
హ్యారీ పోర్టర్ ఫ్రాంచైజ్ ని ఇష్టపడని వారంటూ ఉండరు. ప్రేక్షకుల మందిలో ఈ ఫ్రాంచైజ్ ఆనాటి నుండి ఈ నాటి వరకు ప్రేక్షకుల యెదలో చెరపలేని ముద్రని వేసిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. జె. కె. రౌలింగ్ రాసిన నవలల ఆధారంగా హ్యారీ పోర్టర్ సిరీస్ చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సిరీస్ 7 పార్టులుగా అందుబాటులో ఉంది.
డంబుల్ డోర్ కన్నుమూత (Harry Porter Dumbledore Passed Away):
REST IN PEACE: The Irish-born actor knighted for his storied career on the stage and screen and beloved for his portrayal of Hogwarts headmaster Albus Dumbledore in six of the eight “Harry Potter” films has died at the age of 82.
Rest in peace, Michael Gambon. pic.twitter.com/oRfkSpkOne
— ABC News (@ABC) September 28, 2023
https://twitter.com/HPotterUniverse/status/1707374267950858738
ALSO READ: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే పాపులర్ సినిమా/ సిరీస్ లిస్ట్ ఇదే