అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ తన కుటుంబసమేతంగా ఆత్మహత్యకు (Anakapalli Family Suicide) పాల్పడ్డారు. అప్పుల బాధ తాళలేక కుటుంబం అంత సైనైడ్ తాగి బలవన్మరణానికి ఒడిగట్టినట్టు మీడియా సమాచారం.
ఈ విషాద ఘటనలో నలుగురు మృతి చెందగా మరో చిన్నారి అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెల్సుతోంది. మృతులు శివరామకృష్ణ(40), మాధవి(38), వేద వైష్ణవి(15), జాహ్నవి లక్ష్మి(13), కుసుమ ప్రియ(9) గా పోలీసులు గుర్తించారు.
అనకాపల్లిలో విషాదం (Anakapalli Family Suicide):
అనకాపల్లి జిల్లాలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య.. ముగ్గురు పిల్లలతో సహా సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న దంపతులు.. మృతులు శివరామకృష్ణ(40), మాధవి(38), వేద వైష్ణవి(15), జాహ్నవి లక్ష్మి(13), కుసుమ ప్రియ(9)#AP #Anakapalle #Sucide
— NTV Breaking News (@NTVJustIn) December 29, 2023