Revanth Reddy Arrest: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత మొదలైంది.
అయితే రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి కేసీఆర్ రావాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో భాగంగానే బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్థూపం వద్దకు కార్యకర్తలతో కలసి రేవంత్ రెడ్డి వచ్చారని సమాచారం.
కానీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల అమలవుతున్న నేపథ్యంలో పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకుని వాహనంలో ఆయనని తరలించారు.
దాదాపు పావు గంటకు పైగా రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమాలను అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారని తెల్సుతోంది.
రేవంత్ రెడ్డి అరెస్ట్ (Revanth Reddy Arrest):
గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత..రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు | Hyderabad |Revanth Reddy Arrest#hyderabad #LatestNews #TeluguNews #Telangana #RevanthReddy #congressparty #TelanganaPolitics #Arrest #Prime9News
Watch Video>>>https://t.co/Ykzn29f6fR pic.twitter.com/JoGQFRR9Xz
— Prime9News (@prime9news) October 17, 2023
ALSO READ: బీఆర్‌ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య… కాంగ్రెస్ కు షాక్