Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. అంతా ఊహించినట్లే అధికార పార్టీ టీఆర్ఎస్ మునుగోడు అసెంబ్లీ సీటు ను కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 96,854 (10, 309 ఓట్ల మెజారిటీ ) తో విజయాన్ని అందుకోగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 86,545 ఓట్లతో రెండో స్థానానికి సరిపెట్టుకున్నారు.
అయితే ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ కొన్ని కారణాలతో పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే. అతని రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
గతంలో కాంగ్రెస్ స్థానమైన మునుగోడు నియోజకవర్గంలో, ఈ ఉప ఎన్నకల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కకపోవడం కొసమెరుపు.
ఈ నెల 3వ తేదీన ఎన్నికలు జరగగా, ఈ రోజు ( నవంబర్ 6) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. ప్రతి రౌండ్ ఫలితాలు ఎంతో ఉత్కంఠను రేకెత్తించాయి. మొత్తం 47 మంది అభ్యర్థులు మునుగోడు ఉప ఎన్నిక బరిలో దిగగా, ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోరు కొనసాగింది.
పూర్తి ఫలితాలు ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
టీఆర్ఎస్:96,854
బీజేపీ: 86,545
కాంగ్రెస్:23, 887
బీఎస్పీ:
ఇతరులు: