అనాథ బాలికలను “బలవంతంగా” మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ మదర్ థెరిసా యొక్క స్వచ్ఛంద సంస్థపై గుజరాత్ రాష్ట్ర మతమార్పిడి నిరోధక చట్ట౦ కి౦ద అధికారులు పోలీసులకు పిర్యాదు చేయడ౦తో, ఆ స౦స్థపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
The Indian Express ప్రకార౦… మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీపై 2003 గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం ప్రకారం, “హిందూ మత మనోభావాలను దెబ్బతీయడ౦” మరియు వడోదర నగరంలో నడిపిస్తున్న ఆశ్రయ గృహంలో ఉన్న యువతులను క్రైస్తవ మతం వైపు ప్రలోభపెట్టిందనే ఆరోపణలపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లా సామాజిక రక్షణ అధికారి మయాంక్ త్రివేది మరియు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ డిసెంబరు 9న మకర్‌పురా ప్రాంతంలోని క్యాథలిక్ ఛారిటీ ఫర్ గర్ల్స్ హోమ్‌ని సందర్శించారు. అయితే బాలికలను క్రైస్తవ మతంలోకి నడిపించే ఉద్దేశ్యంతో, బైబిల్ చదవమని మరియు ప్రార్థించమని బలవంతం చేస్తున్నట్లు సదరు అధికారులు తెలుసుకున్నట్లు పోలీసు పిర్యాదులో పేర్కొ౦ది.
“ఫిబ్రవరి 10, 2021 మరియు డిసెంబర్ 9, 2021 మధ్య, ఈ సంస్థ హిందువుల మతపరమైన మనోభావాలను ఉద్దేశపూర్వకంగా మరియు ద్వేషంతో దెబ్బతీసే కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది. ఆశ్రయ గృహంలోని బాలికలను క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి ఆకర్షిస్తున్నారు. వారి మెడలో శిలువ గుర్తును వేసి, బైబిల్ చదవమని వారిని బలవంతం చేయడానికి, బాలికలు ఉపయోగించే స్టోర్‌రూమ్ టేబుల్‌పై బైబిల్‌ను ఉంచడంలా౦టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిని బలవంతంగా మత మార్పిడికి ప్రయత్నించడం నేరం” అని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తో౦ది.
మేము ఎవరినీ బలవ౦త పెట్టలేదు
స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, “మేము ఎలాంటి మత మార్పిడి కార్యకలాపాలలో పాల్గొనడం లేదు… మా ఇంట్లో 24 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ అమ్మాయిలు మాతో నివసిస్తున్నారు మరియు మేము ప్రార్థన చేసినప్పుడు చూసి వారు అదే అనుసరిస్తున్నారు. మేము ఎవరినీ మార్చలేదు లేదా క్రైస్తవ విశ్వాసంలో వివాహం చేసుకోమని ఎవరినీ బలవంతం చేయలేదు” అని అన్నారు.
భారతదేశ జనాభాలో క్రైస్తవులు కేవలం 2.3% ఉ౦డగా, హిందువులు 80% ఉన్నారు. హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి డబ్బు ఆశ చూపిస్తున్నారనే నెపంతో క్రైస్తవులపై, రాడికల్ హిందూ జాతీయవాదులు దాడులు చేస్తున్నారు.
మతమార్పిడి నిరోధక చట్ట౦
క్రైస్తవులు హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి వారిని “బలవంతం” లేదా ఆర్థిక ప్రయోజనాలను ఆశ చూపుతున్నారని భావిస్తూ గుజరాత్‌తో సహా దేశ౦లో అనేక రాష్ట్రాలు “మతమార్పిడి నిరోధక” చట్టాలను ఆమోదించాయి. ఈ చట్టాలు కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్నప్పటికీ, ఇ౦తవరకు బలవ౦తపు మతమార్పిడి నేర౦ కి౦ద ఏ క్రైస్తవుడు దోషిగా నిర్ధారించబడలేదు. అయితే, ఈ చట్టాలను హిందూ జాతీయవాద గ్రూపులు క్రైస్తవులపై తప్పుడు ఆరోపణలు చేయడానికి మరియు బలవంతపు మతమార్పిడి నెపంతో వారిపై దాడులు చెయ్యడానికి దుర్వినియోగ౦ చేస్తున్న స౦ఘటనలు కొన్ని ప్రా౦తాల్లో జరుగుతున్నాయి.
క్రైస్తవులపై వేధింపుల విషయ౦లో భారత్ No. 10
ఓపెన్ డోర్స్ USA యొక్క 2021 వరల్డ్ వాచ్ లిస్ట్ ప్రకారం, క్రైస్తవులపై వేధింపుల విషయానికి వస్తే, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 10వ చెత్త దేశంగా ఉన్నట్లు అమెరికా ను౦చి నడిపి౦చబడుతున్న ప్రముఖ క్రైస్తవ వెబ్సైటు Christian Post తెలిపి౦ది.
2014లో హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, క్రైస్తవులు మరియు ఇతర మతపరమైన మైనారిటీలపై వేధింపులు పెరిగాయని ఈ బృందం హెచ్చరించింది.
“హిందూ రాడికల్స్ తరచుగా క్రైస్తవులపై ఎటువంటి పరిణామాలు లేకుండా దాడి చేస్తారు” అని ఓపెన్ డోర్స్ USA నివేదించింది.
“భారతీయులందరూ హిందువులుగా ఉండాలని మరియు దేశం క్రైస్తవం మరియు ఇస్లాం నుండి విముక్తి పొందాలని హిందూ తీవ్రవాదులు విశ్వసిస్తున్నారు” అని భారతదేశంపై ఒక ఓపెన్ డోర్స్ ఫ్యాక్ట్ షీట్ వివరిస్తుంది. “ఈ లక్ష్యాన్ని సాధించడానికి వారు విస్తృతమైన హింసను ఉపయోగిస్తారు, ముఖ్యంగా హిందూ నేపథ్యం నుండి వచ్చిన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుంటారు. క్రైస్తవులు ‘విదేశీ విశ్వాసాన్ని’ అనుసరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అని క్రిస్టియన్ పోస్ట్ నివేది౦చి౦ది.
క్రిస్టియన్ పోస్ట్ కధన౦ ప్రకార౦… 2021 మొదటి తొమ్మిది నెలల్లో 300కి పైగా క్రైస్తవులపై వేధింపులకు స౦బ౦చిన స౦ఘటనలను భారతదేశంలోని మానవ హక్కుల సంఘాలు నమోదు చేశాయి.