ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. బాపట్ల నియోజక వర్గంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో వైఎస్ షర్మిల (YS Sharmila Bapatla Meeting) పాల్గొన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బయటకు రాని సీఎం జగన్ ఇప్పుడు సిద్ధం (Siddham) అంటూ ముందుకు వచ్చారని షర్మిల విమర్శించారు. ఈ నేపథ్యంలో షర్మిల మాట్లాడుతూ… ప్రత్యేక హోదా ను మళ్ళీ బీజేపీకు తాకట్టు పెట్టడానికి సిద్ధమా ? లేక బీజేపీ తో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? అంటూ షర్మిల ప్రశ్నించారు (YS Sharmila Questions CM Jagan).
అలాగే మద్యపాన నిషేధం అని ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా ? 25 లక్షల ఇండ్లు కడతామని మోసం చేయడానికి సిద్ధమా ? లేక రాష్ట్రంలో లిక్కర్,మైనింగ్ మాఫియా కు సిద్ధమా ?. మీరు సిద్ధం అయితే ప్రజలు మిమల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు అన్నారు.
ఇకపోతే కేంద్రంలో కనుక మళ్ళీ బీజేపీ అధికారంలో వస్తే హోదా రాదని షర్మిలా అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు కి ఓటు వేసినా…జగన్ కి ఓటు వేసినా లేక పవన్ కళ్యాణ్ కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే. బీజేపీ అంటే బాబు.. జగన్… పవన్ అని షర్మిలా చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కు హోదా రావాలంటే కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అని… అధికారంలో వచ్చిన మొదటి రోజే హోదా పై సంతకం పెడతా అని ఇప్పటికే రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని షర్మిల గుర్తుచేశారు.
దేనికి సిద్ధం? (YS Sharmila questions CM Jagan):
దేనికి సిద్ధం జగన్ సారూ? మరో 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్లీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా ? మళ్లీ ప్రత్యేక హోదాను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్లీ పూర్తి మద్యపాన నిషేధమని మోసం చేయడానికి సిద్ధమా? 25 లక్షల ఇళ్ళు కడతామని మోసం చేయడానికి… pic.twitter.com/vTz8moORec
— YS Sharmila (@realyssharmila) February 7, 2024
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే…రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. తిరుపతి సభలో మోడీ పదేళ్లు హామీ ఇచ్చారు. చంద్రబాబు 15 కావాలన్నారు.. జగనన్న గారు మూకుమ్మడిగా రాజీనామాలకు పిలుపునిచ్చాడు. అధికారంలోకి వచ్చాక ఎంత మందితో రాజీనామాలు చేయించారు. ఇద్దరు నాయకులు అధికారం… pic.twitter.com/hCFPaoWxLH
— YS Sharmila (@realyssharmila) February 8, 2024
ALSO READ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కే.ఏ.పాల్ ఫైర్