వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా (YSRCP – YS Jagan Delhi Protest) చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచిన దగ్గర నుంచి రాష్ట్రంలో పరిస్థితులపై నిరసన తెలిపేందుకు జగన్, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు ముఖ్య నాయకులతో దేశ రాజధాని వద్ద ధర్నా నిర్వహించనున్నారు.
గడిచిన 50 రోజులలో కూటమి ప్రభుత్వం అధికారంలో 36 హత్యలు, వెయ్యికి పైగా దాడులతో ప్రభుత్వం రాష్ట్రంలో మారణహోమం చేస్తోంది అని జగన్ తెలిపారు.
ఢిల్లీలో జగన్ ధర్నా (YSRCP – YS Jagan Delhi Protest):
https://twitter.com/YSRCParty/status/1815980590866522206
గంటకో దౌర్జన్యం, పూటకో దారుణం, రోజుకో హత్య చొప్పున ఏపీ ఇప్పుడు బీహార్‌ని తలపిస్తోంది. లా అండ్ ఆర్డర్‌ను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. దాంతో రాష్ట్రంలో పెరిగిన అరాచకాల్ని దేశానికి చెబుతూ.. రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీలో వైయస్ఆర్సీపీ ఈరోజు ధర్నా చేస్తోంది.… pic.twitter.com/4WPdS8PQFl
— YSR Congress Party (@YSRCParty) July 24, 2024
ALSO READ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం