Telangana Elections 2023: నవంబర్‌ 30న తెలంగాణ ఎన్నికలు

Date:

Share post:

Telangana Assembly Elections Schedule 2023: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంగం ప్రకటించింది. 2023 నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్రంతో సహా ఐదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది.

ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంగం మీడియా సమావేశంలో… మధ్య ప్రదేశ్ లో 230 స్థానాలు, రాజస్థాన్ లో 200 స్థానాలు, తెలంగాణలో 119 స్థానాలు, ఛత్తీస్‌గఢ్ లో 90 స్థానాలు, మిజోరాం లో 40 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అంతేకాదు ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యయంపై నిరంతర నిఘా ఉంచుతున్నట్లు చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్ తెలిపారు.

ఈ ప్రకటనతో 5 రాష్ట్రాలలోని పార్టీలలో ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల హడావిడి ఊపందుకోనున్నాయి. అంతే కాదు ఎన్నికలు షెడ్యూల్ విడుదల ఇవాళ అవడంతో రాష్ట్రాల్లో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్: (Telangana Elections 2023 Schedule)

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంగం ప్రకటించింది.  నామినేషన్లు సమర్పించేందుకు చివరి తేదీని నవంబర్ 10 కి ఖరారు చేయగా… పోలింగ్ తేదీని నవంబర్ 30 కు, ఓట్ల కౌంటింగ్ డిసెంబర్ 3న చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఐదు రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్: (Elections 2023 Schedule)

ALSO READ: తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

గుర్తింపులేని జనసేన పార్టీకి అనుమతి ఎలా ఇచ్చారు? విజయసాయిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తున్న సంగతి తెలిసినదే. అయితే ఈ రోజు అనగా మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం...

రాజస్థాన్ లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Rajasthan Elections 2023: రాజస్థాన్ లో నేడు అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 199 స్థానాలకు గాను ఒకే విడతలో శనివారం ఉదయం...

ఐదు రాష్ట్రాలల్లో రూ.1,760 కోట్లు పట్టివేత… తెలంగాణే టాప్

Election Commission seized 1760 crore: ఐదు రాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లని ప్రలోభపరచేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతున్నట్లు...

పవన్ తో కిషన్ భేటీ… తెలంగాణలో ఉమ్మడి పోటీపై చర్చ

Kishan Reddy meets Pawan Kalyan: తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ లో...

తెలంగాణ లో కేంద్ర ఎన్నికల సంగం పర్యటన… తేదీలు ఖరారు

Election Commission Telangana Visit: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం...

మహాత్మా గాంధీని దుర్భాషలాడిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ అరెస్టు

మహాత్మా గాంధీని దుర్భాషలాడారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నాలుగు రోజుల తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌ను ఛత్తీస్‌గఢ్...

రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు, ఆరుగురు CRPF జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 వద్ద శనివారం ఉదయం జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్...

ఛత్తీస్‌గఢ్‌ లో భద్రతా బలగాల పై మావోయిస్టుల దాడి, 22 మ౦ది జవాన్లు మృతి

Chhattisgarh Naxal Attack: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర౦ సుక్మా‍ - బీజాపూర్ ప్రా౦త౦లో భద్రతా బలగాలు మావోయిస్టుల మద్య జరిగిన ఎదురు కాల్పులలో 22...