రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు, ఆరుగురు CRPF జవాన్లకు గాయాలు

bomb blast in raipur

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 వద్ద శనివారం ఉదయం జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు గాయపడినట్లు సమాచారమ౦ది౦దని టైమ్స్ నౌ న్యూస్ తెలిపి౦ది.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరికొందరు గాయాలపాలై చికిత్స పొందుతున్నారని చెప్పారు.

టైమ్స్ నౌ న్యూస్ సమాచార౦ ప్రకార౦…ఉదయం 6:30 గంటల సమయంలో పేలుడు సంభవించిందని, రైల్వే స్టేషన్‌లోని సిఆర్‌పిఎఫ్ స్పెషల్ ట్రైన్‌లో ఇగ్నిటర్ సెట్ ఉన్న బాక్స్ నేలపై పడడంతో ఇది సంభవించిందని రాయపూర్ పోలీసులు తెలిపారు.