శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ద్వారా సుమారు రూ. 200 కోట్లు భారీ ఆర్థిక మోసం ( Rs. 200Cr scam) జరిగిందని, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ అడ్వకేట్ ఉదయకాంత్ ( Advocate Uday Kanth) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
టీపీసీసీ – మానవ హక్కులు & ఆర్టీఐ విభాగం లీగల్ వైస్ చైర్మన్ శ్రీ కాంపెల్లి ఉదయ్ కాంత్, ఈ రోజు ( 20 నవంబర్ 2024) నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ ద్వారా శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ ద్వారా విస్తృత స్థాయిలో జరిగిన ఆర్థిక మోసంపై దృష్టి సారించాలని తెలియజేయటం జరిగింది. ఈ సందర్బంగా కాంపెల్లి ఉదయ్ కాంత్ మాట్లాడుతూ…
శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ ( Sri Priyanka Enterprises) సంస్థ ద్వారా జరిగిన మోసం సుమారు రూ. 200 కోట్లుగా అంచనా వేయబడింది. దీనికి సంభించి 517 మంది భాదితులు ఉండగా అందులో చాలా మంది వృద్ధులు ఉన్నారు…ఈ భారీ అవినీతి చేసిన సంస్థ డైరెక్టర్లు మేకా నేతాజీ, మేకా హర్ష, మరియు శ్రీమతి నిమ్మగడ్డ వనిబాలపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్బంగా పలు డిమాండ్ లు చేశారు.