రేపు (బుధవారం) నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు (Kondangal Lift Irrigation Foundation Stone). మీడియా సమాచారం ప్రకారం… రూ.2,945.5 కోట్ల వ్యయంతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలలో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా చేసేందు కోసం ఈ ప్రాజెక్ట్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఈ శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు… ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొనున్నట్లు సమాచారం.
ALSO READ: తెలంగాణ: అసెంబ్లీలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల