సంయుక్త ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14వ తారీకున తన కుమారుడితో సహా ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీ పార్టీలో చేరుకున్నారు (Mudragada Padmanabham joining YSRCP on March 14th).
ఈ మేరకు ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తాను ఈ నెల 14న తన కుమారుడితో సహా తాడేపల్లిలో సీఎం సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్నట్లు వివరించారు.
అలాగే రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని. తాను ఏలాంటి పదవులు ఆశించడం లేదని… భగవంతుడు దయవల్ల ఇంకోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గెలిస్తే ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నానని ముద్రగడ తెలిపారు.
వైసీపీ లో చేరనున్న ముద్రగడ (Mudragada Padmanabham joining YSRCP):
బిగ్ బ్రేకింగ్
ఈనెల 14న వైఎస్సార్సీపీలో చేరనున్న కాపు సంఘ నేత ముద్రగడ్డ పద్మనాభం
సీఎం వైఎస్ఆర్ జగన్ సమక్షంలో నేను, నా కుమారుడు గిరి పార్టీ లో చేరతాం
నేను ఏలాంటి పదవులు ఆశించడం లేదు. భగవంతుడు దయవల్ల మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గెలిస్తే ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకునేందుకు… pic.twitter.com/l2JsUfEr6p
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2024
ALSO READ: బాబు ఓడిపోతేనే… జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి టీడీపీ వస్తుంది