జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా తనదయిన శైలిలో సంచల వ్యాఖ్యలు చేశారు (Minister Roja comments on Pawan Kalyan). నిన్న తాడేపల్లిగూడెం వేదికగా జరిగిన టీడీపీ-జనసేన నిర్వహించిన ‘జెండా’ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు.
ఈ సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ తారా స్థాయిలో ఉందని నిన్న సభ చూస్తే అర్థమైంది. అయన తెలుసుకోవాల్సిందే ఏంటి అంటే… ఆవేశంగా మాట్లాడితేనో, లేదా గట్టిగా అరిస్తేనో ఓట్లు పడతాయి అనుకుంటే ఆర్. నారాయణ మూర్తి గారు ఎప్పుడో ప్రధాని అయ్యుండేవారు అన్నారు.
అలాగే, పవన్ కళ్యాణ్ మరియు జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం ఒక సంవత్సరం తేడా ఉంటుంది. మరి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలిచి ఏపీ ముఖ్యమంత్రిగా ఎలా అయ్యారు. నువ్వు రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లు కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావ్ అంటే అర్ధం చేసుకోవాలి.
ఒక పార్టీ ప్రెసిడెంట్ గా కేవలం 24 సీట్లకే పరిమితం అయిపోయి, మళ్ళీ క్యాడర్ ని తిడుతున్నావ్. ఒక మండల కమిటీను కానీ బూత్ కమిటీను కానీ ఏర్పాటు చేయాల్సింది పార్టీ ప్రెసిడెంట్. నువ్వు పేరుకే పార్టీ ప్రెసిడెంట్ కానీ… ఏ రోజు అయినా పార్టీ నిర్మాణ పనులు చేసావా అంటూ పవన్ ని రోజా ప్రశ్నించారు.
పొత్తులో భాగంగా ముప్పయ్ సీట్లను కూడా తెచుకోలేని నువ్వు… జగన్ అన్నని అదఃపాతాళానికి తొక్కుతానంటున్నావ్..! నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ అదఃపాతాళానికి వెళ్లిపోయావ్ అన్న సంగతి స్పష్టం అయ్యిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ పై సంచల వ్యాఖ్యలు (Minister Roja comments on Pawan Kalyan):
ఊగిపోతే ఓట్లు పడవు పవన్ కళ్యాణ్ : Minister Roja#AndhraPradesh #APElections2024 #YSRCP #CMYSJagan #TDP #ChandraBabu #JanaSena #PawanKalyan #Tadepalligudem #Roja #NTVTelugu #TeluguNews pic.twitter.com/tvhsCXtOJO
— NTV Telugu (@NtvTeluguLive) February 29, 2024
పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ లపై రోజా సంచలన వ్యాఖ్యలు..#Roja #RojaSelvamani #PawanKalyan #JanaSenaParty #ChandrababuNaidu #TDPJanasena #CMYSJagan #NTVTelugu pic.twitter.com/EMuyM0uTHc
— NTV Telugu (@NtvTeluguLive) February 29, 2024
ALSO READ: కేటిఆర్… దమ్ముంటే ఒక్క సీట్ గెల్వు: రేవంత్ రెడ్డి సవాల్