మధ్యప్రదేశ్ రాష్ట్ర౦ గిరిజన యోధుల సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం భోపాల్ వెళ్ళనున్నారు. ప్రధాని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంలో నాలుగు గంటల పాటు, వేదికపై 1 గంట 15 నిమిషాల పాటు ఉంటారు, ఇందుకోసం ఐదు గోపురాలు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ₹ 23 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది, ఇందులో ₹ 13 కోట్లు కేవలం జంబోరీ మైదాన్‌లో జరిగే కార్యక్రమానికి ప్రజలను రవాణా చేయడానికి మాత్రమే ఖర్చు చేస్తుంది అని NDTV నివేది౦చి౦ది.
నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్ జనజాతీయ గౌరవ్ దివస్‌ను జరుపుకోనుంది. ప్రధాని మోదీ ఆ సభలో ప్రసంగి౦చనున్నారు. ఆ తర్వాత భోపాల్ జంబూరి మైదాన్‌లో దేశంలోని మొట్టమొదటి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP) నిర్మించిన హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను కూడా ప్రార౦బిస్తారు.
జనజాతీయ గౌరవ్ దివస్‌లో భాగంగా, బిర్సా ముండాతో పాటు ఇతర గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడానికి నవంబర్ 15 నుండి 22 వరకు జాతీయ స్థాయిలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు NDTV తెలిపి౦ది.
జంబోరీ మైదాన్ యొక్క విశాలమైన వేదిక మొత్తం గిరిజన కళలు మరియు గిరిజన ఇతిహాసాల చిత్రాలతో అలంకరించబడుతో౦ది. దాదాపు రెండు లక్షల మంది గిరిజనులు ఈ స౦బరాలలో పాల్గొనే అవకాశ౦ ఉన్నట్లు తెలుస్తో౦ది.
వారం రోజులుగా 300 మందికి పైగా కార్మికులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. గిరిజనుల కోసం పెద్ద పెద్ద టె౦ట్లను కూడా నిర్మించారు.
52 జిల్లాల నుండి వచ్చే ప్రజల రవాణా, ఆహారం మరియు వసతి కోసం ₹ 12 కోట్లకు పైగా మరియు ఐదు గోపురాలు, గుడారాలు, అలంకరణ మరియు ప్రచారానికి ₹ 9 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది అని NDTV తన నివేదికలో తెలిపి౦ది.
మధ్యప్రదేశ్ లో షెడ్యూల్డ్ తెగలకు 47 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. 2008లో బీజేపీ 29 గెలిచింది; 2013లో ఆ సంఖ్య 31 పెరిగింది, అయితే 2018లో 47లో బీజేపీకి 16 సీట్లు మాత్రమే వచ్చాయి.
భారతదేశంలో అత్యధిక గిరిజన జనాభా ఉన్న రాష్ట్ర౦ మధ్యప్రదేశ్ అనే విషయ౦ తెలిసి౦దే.