హైదరాబాద్ లో వ్యాక్సీన్ టెస్టింగ్ సెంటర్: మంత్రి కేటీఆర్

దేశంలో ఉన్న ఏకైక వ్యాక్సిన్ టెస్టింగ్ కసౌలిలో ఉన్నదని, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సెంటర్ కి ఇక్కడి సంస్థలు తయారుచేసే ప్రతి బ్యాచ్ వ్యాక్సిన్ ని టెస్టింగ్ కు పంపాల్సిన అవసరం ఉంటుందన్నారు.

Date:

Share post:

KTR Requests Centre for setting up Vaccine Testing Lab in Hyderabad

– వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కోసం కేంద్రాన్ని కోరిన కేటీఆర్
– ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా మారిన హైదరాబాద్ లో ఈ టెస్టింగ్ సెంటర్ అత్యవసరం
– వందల కిలోమీటర్ల దూరంలో కసౌళిలో ఉన్న జాతీయ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ కు ఇక్కడి సంస్థలు టెస్టింగ్ కి పంపడం ద్వారా 45 రోజుల సమయం వృధా అవుతుంది
– ఇక్కడే టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తే నెలకి సుమారు 8 నుంచి 10 కోట్ల డోసులను అదనంగా ఉత్పత్తి చేయవచ్చు
– రానున్న ఆరు నెలల్లో హైదరాబాద్ నుంచి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అయ్యే అవకాశం

 
ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్న హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పలు సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిందని, ఇప్పటికైన ఈ దిశగా కేంద్రం సరైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి శ్రీ హర్షవర్ధన్ మరియు కేంద్ర మంత్రి శ్రీ సదానంద గౌడ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరం కేవలం భారతదేశానికే కాక ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా ప్రాధాన్యత పొందినదని, భారతదేశం దేశీయంగా తయారు చేసిన తొలి వ్యాక్సిన్ కోవాక్సిన్ ఇక్కడినుంచి తయారు అవుతున్న విషయాన్ని గుర్తించాలని కోరారు.

దీంతోపాటు స్పుత్నిక్ వి, కోర్బావాక్స్, భారత్ బయోటెక్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీల వ్యాక్సిన్లు సైతం ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి ఈ సంవత్సరాంతానికి దాదాపు 50 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నదని ప్రకటించిన నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు అవసరమైన వాక్సిన్ ఉత్పత్తి పెద్ద ఎత్తున హైదరాబాద్ లోనే ఉత్పత్తి జరగబోతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

కేంద్రం చేపట్టబోయే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకి సుమారు 100 కోట్ల డోసులు హైదరాబాద్ నగరం నుంచి రానున్న ఆరు నెలల్లో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయన్నారు.

దేశంలో రెండో వ్యాక్సీన్ టెస్టింగ్ సెంటర్

ఇంతటి ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్ నగరంలో వ్యాక్సినేషన్ టెస్టింగ్ సెంటర్ లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. దేశంలో ఉన్న ఏకైక వ్యాక్సిన్ టెస్టింగ్ కసౌలిలో ఉన్నదని, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సెంటర్ కి ఇక్కడి సంస్థలు తయారుచేసే ప్రతి బ్యాచ్ వ్యాక్సిన్ ని టెస్టింగ్ కు పంపాల్సిన అవసరం ఉంటుందన్నారు.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానాల్లో పంపి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పంపించే వెసులుబాటు మాత్రమే ఉన్నదని, మొత్తం ఈ టెస్టింగ్ ప్రక్రియకి 30 నుంచి 45 రోజుల సమయం పడుతుందన్నారు. దీని ద్వారా విలువైన సమయం వృధా అవుతుందని హైదరాబాద్ లో ఉన్న బయోటెక్ కంపెనీలు తెలిపారన్నారు.

అయితే భారత్ దేశంలో రెండవ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయడం ద్వారా మరింత వేగంగా హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున ప్రజలకు వ్యాక్సిన్ అత్యవసరంగా మారిన ఈ పరిస్థితుల్లో సాధ్యమైనంత తక్కువ సమయంలో ఎక్కువ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలంటే, విలువైన 30-45 రోజుల సమయాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ అత్యావశ్యకమైన విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు.

భారతదేశం వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఇప్పటికీ పలు ప్రయత్నాలు చేస్తోందని, ఈ దిశగా ఇక్కడి ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ఈ వ్యాక్సిన్ సెంటర్ ను తక్షణమే ఏర్పాటు చేయాల్సిందిగా కేటీఆర్ కోరారు.

దేశంలోనే అత్యధిక వ్యాక్సిన్ తయారీ కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నందున ఆయా కంపెనీలకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఇక్కడ ఈ సెంటర్ ను ఏర్పాటు చేయాలని, ఇక్కడ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తే ప్రతి నెల 8 నుంచి 10 కోట్ల అదనపు వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసే వీలు కలుగుతుందని తెలిపారు.

ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచమంతా మూడవ దశ కరోనా, సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెల మధ్యలో వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్న ఆ సమయంలో, దాన్ని ఎదుర్కోవాలంటే సాధ్యమైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ వేయడమే పరిష్కార మార్గమని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఈ వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లాబరేటరీ మాదిరే ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని కోరారు.

హైదరాబాద్ నగరంలో ఉన్న జీనోమ్ వ్యాలీ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ కి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ సరఫరా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని తక్షణమే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం

తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన ప్రమాణస్వీకారం

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన తీన్మార్‌ మల్లన్న ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా నేడు (గురువారం)...

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...

ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం...

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

SRH vs LSG: దుమ్మురేపిన హైదరాబాద్… లక్నోపై ఘనవిజయం

SRH vs LSG: ఐపీఎల్ 2024 లో నిన్న (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్...

SRH vs LSG: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs LSG) తలపడనుంది....

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...