ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం

Date:

Share post:

Jio AirFiber: నెటిజన్లు ఎంతో ఆసిక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ మార్కెట్లోకి రానే వచ్చింది. దేశంలోని మొత్తం 8 మెట్రో నగరాల్లో 5 జీ స్పీడ్ తో వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తునట్లు జియో సంస్థ తెలిపింది.

గత నెల ఆగస్టు 28 న జరిగిన 46వ సాధారణ కంపెనీ వార్షిక సమావేశంలో ప్రకటించినట్లుగానే ఈ జియో ఎయిర్ ఫైబర్ సర్వీసులని వినాయక చవితి సందర్భంగా ప్రారంభించారు. ముందుగా ఈ సేవలని అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, పుణె, ముంబై నగరాల్లో అందుబాటులోకి వచ్చాయని రిలయన్స్ అధికారిక ప్రకటన చేసింది.

జియో ఎయిర్ ఫైబర్:

జియో ఎయిర్ ఫైబర్ 5జి ఆధారిత వైర్లెస్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వైర్ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లకు ప్రత్యాన్మయం ఈ సేవలను జియో తీసుకొంచినట్లు తెలుస్తోంది.

ఈ జియో ఎయిర్ ఫైబర్ సాధారణ బ్రాడ్ బ్యాండ్ కంటే అత్యంత వేగవంతమైనది. దీనిని ఇంట్లో అలాగే ఆఫీసులో ఎక్కడైనా ప్లగ్ ఇన్ చేస్కుని వినియోగదారులు సేవలను ఆనందించవచ్చు.

జియో ఫైబర్/ జియో ఎయిర్ ఫైబర్:

దేశంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న జియో ఫైబర్ కు కొత్తగా ప్రవేశపెట్టిన జియో ఎయిర్ ఫైబర్ కు జనాలు పొరపడే అవకాశం ఉంది. జియో ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. అయితే జియో ఎయిర్ ఫైబర్ ఇందుకు భిన్నమైనది.

ఎలాంటి వైర్ కనెక్షన్ లేకుండానే జియో ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ అందిస్తుంది. ఎయిర్ ఫైబర్ ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం హై స్పీడ్ ఇంటర్నెట్ సులువుగా అందుబాటులోకి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జియో ఎయిర్ ఫైబర్ వైర్లెస్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు.

జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లు:

  1. రూ.599 ప్లాన్‌- 30 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్(డిస్నీ+ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ తదిత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లభిస్తాయి).
  2. రూ.899 ప్లాన్- 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్(డిస్నీ+ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ తదిత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లభిస్తాయి).
  3. రూ. ప్లాన్- 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ (నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ తదిత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లభిస్తాయి).

జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ ప్లాన్లు:

  1. రూ.1499 ప్లాన్- 300 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ (నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ తదిత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లభిస్తాయి).
  2. రూ.2499 ప్లాన్- 500 ఎంబీపీఎస్ స్పీడ్ (నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ తదిత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లభిస్తాయి).
  3. రూ.3999- 1 జీబీపీఎస్ స్పీడ్ (నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ తదిత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లభిస్తాయి).
  • ఈ ప్లాన్లు 6/12 నెలల సుబ్స్క్రిప్షన్ ఆప్షన్ తో అందుబాటులో ఉన్నాయి.
  • అయితే ఈ ప్లాన్లపై అదనంగా జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది.
  • జియో ఎయిర్ ఫైబర్ ఇన్‌స్టలేషన్ చార్జీల కింద రూ.1000 చెలించాల్సి ఉంటుంది.
  • 12 నెలల సుబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నవారికి ఇన్స్టలేషన్ చార్జీలు వర్తించవు.

ప్రయోజనాలు:

ఈ జియో ఎయిర్ ఫైబర్ తో కేవలం వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ సేవలే కాకుండా, 550 కి పైగా టీవీ ఛానెళ్లు మరియు 16 కు పైగా ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ ను ఒక్క కనక్షన్ తోనే పొందవచ్చు అని తెలుస్తోంది.

జియో ఎయిర్ ఫైబర్ (Jio AirFiber):

ALSO READ: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో… నేడే ప్రారంభం

పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో నేడు అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు (Indias First Underwater...

ఐదేళ్లలో గుజరాత్ కు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు: అదానీ

అదానీ గ్రూప్ ఛైర్‌పర్సన్, ప్రపంచ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీ సంచలన ప్రకటన చేశారు. రానున్న ఐదు సంవత్సరాలలో గుజరాత్ రాష్ట్రానికి 2...

World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?

ICC World CUP 2023 Points Table: ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టిక- జట్టు ర్యాంకింగ్‌లు, పాయింట్లు, గెలిచిన మ్యాచ్‌లు, నెట్...

హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ కన్నుమూత

M S Swaminathan Died: భారత హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు....

బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్

Byjus New CEO: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ భాద్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సీఈఓగా...