హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Date:

Share post:

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనే కాకుండా సోషల్ మీడియా మొత్తం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం పై కేంద్ర ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదన్న విషయాన్ని గమనించాలి.

మోదీ సర్కారు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన చేసిన దగ్గర్నుంచి జోరుగా ఈ వదంతులు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి 2024 నాటికీ పది సంవత్సరాలు పూర్తి కాబోతోంది. ఈ విభజనలో ప్రక్రియలో భాగంగా… తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం నిర్ణయించిందని మనందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ గడువు 2024 నాటికి ముగియనున్న తరుణంలో హైదరాబాద్‌ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) గా చేయడం వల్ల బీజేపీకి ఇక్కడ బలపడే అవకాశం ఉంటుందని కొంతమంది అంటుంటే… మరికొంత మంది హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ ను బలహీన పరిచేందుకు కేంద్రం వేసిన మాస్టర్ ప్లాన్ గా కొందరు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహోరాత్రులు కష్టపడి, పోరాటాలు చేసి, నిరసనలు తెలిపి, తమ ప్రాణాలు సైతం లెక్కచేకుండా దక్కించుకున్న ఈ రాష్ట్రాన్ని యూటిగా ప్రకటిస్తే ప్రజలు ఊరుకుంటారా… లేదా మరోసారి ఏకమవుతారా? మరి ఈ పోరాటాల్లో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు ఎలా స్పందిస్తారు?

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన రాష్ట్ర సత్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కేంద్ర నిరన్యం తో ఏకీభవిస్తుందా… లేక కేంద్రానికే ఎదురు తిరుగుతుందా?

హైదరాబాద్ ను యూటి గా చేస్తే ఏమవుతుంది?

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ నగరం ప్రత్యేక పాత్ర పోషించింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ సేతం హైదరాబాద్ నుంచే వస్తుందన్న విషయం తెలిసినదే. మరిప్పుడు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే రాష్ట్రంలో కేవలం కేంద్ర విధించే పన్ను మాత్రమే ఉంటుంది. రాష్ట్ర పన్ను ఇక ఎక్కడ వర్తించదు.

దీంతో రాష్ట్ర ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడినట్లే. ఈ భారం ప్రభుత్వం అమలు చేసే పథకాలపై పడుతుంది. మరోపక్క రాష్ట్ర అభివృధికి అడ్డు పడినట్లే. ప్రస్తుతం ఉన్న అప్పులకన్నా రాష్ట్రం మర్రిని అప్పులు చేయాల్సి ఉంటుంది.

అంతేకాకుండా రాష్ట్రానికి మరో రాజధాని నగరాన్ని నిర్మించాల్సి వస్తుంది… మరీ రాజధానిని కేంద్ర నిర్మిస్తుందా లేక రాష్ట్రమే నిర్ముచుకోవాలా? రాష్ట్రంలో కొత్తగా ఐ.టి వ్యవస్థను ప్రారంభించి స్థిరపరచాలి… ఈలోగా విదేశీ పెట్టుబడులు తగ్గిపోవచ్చు. ఉద్యోగ కల్పనకు సమయపడుతుంది దీంతో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది.

అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రకటిస్తే… ప్రజల మద్దతు బీఆర్ఎస్‌ పార్టీ వైపే ముగ్గు చూపుతారన్నది ఖాయం. అయితే రాష్ట్ర ప్రభుత్వం, వివిధ పార్టీల నేతలు మరియు ప్రజలు కేంద్ర నిర్ణయంపై ఎలా స్పందిస్తారు అన్నది మాత్రం ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది.

ALSO READ: దేశంలో ఎమర్జెన్సీ అలెర్ట్…! కారణం ఇదే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

IPL 2024 SRH vs RR : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR)...

IPL 2024 CSK vs PBKS: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2024 CSK vs PBKS: హోంగ్రౌండ్ లో చెన్నైకి షాక్ (PBKS beat CSK). ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం

IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...