మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

Date:

Share post:

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి చేశారు.

ఈ ఘటన డిసెంబర్ 29న బెళగావి జిల్లా ముదలగి ప్రాంతంలో జరిగినట్లు ఇ౦డియా టుడే నివేది౦చి౦ది.

ఇ౦డియా టుడే కధన౦ ప్రకార౦… పాస్టర్ అక్షయ్‌కుమార్ కరగన్వి తన నివాసంలో ప్రార్థనలు చేస్తుండగా, రైట్‌వింగ్ సభ్యులు అతని ఇంటిపై దాడి చేసి ప్రార్థన సెషన్‌ను ఆపాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. తమ పొరుగి౦టివారిని అక్రమంగా మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారు.

దు౦డగులు వేడి కూరను ఒక మహిళపై విసిరారని పాస్టర్ భార్య కవిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం దాడికి గురైన మహిళ‌ బెలగావిలోని ఓ ఆస్పత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న పేర్కొన్నారు. అయితే దాడి జరుగుతున్నప్పుడు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన మరో మహిళపై కూడా దాడి చేశారని ఫిర్యాదుదారు తన క౦ప్లై౦ట్ లో పేర్కొన్నారు.

ఈ ఘటన తర్వాత శివానంద్ శివలింగప్ప, రమేష్ దండాపూర్, పరసప్ప బాబు, ఫకీరప్ప బాగేవాడి, కృష్ణ కాంతికర్, చతన్ రాజేంద్ర, మహంతేష్ బసలింగప్ప అనే ఏడుగురు నిందితులపై ఘటప్రభ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వార౦తా ముదలగి నివాసులని తెలుస్తో౦ది.

నిందితులపై IPCలోని వివిధ సెక్షన్లు 143 (అల్లర్లు), 448 (అతిక్రమించడం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 392 (దోపిడీ), 506 (నేరపూరిత బెదిరింపు), మరియు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అట్రాసిటీల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు.

With inputs from India Today

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

IPL 2024 RCB vs SRH: హైదరాబాద్ ఘన విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ కేతనం ఎగరవేసింది. ఐపీఎల్-17లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...

రైతుల కోసం రేపు బండి సంజయ్ ‘రైతు దీక్ష’

Telangana: రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష పేరుతో నిరసన తెలిపనున్నారు (Bandi Sanjay...

బీజేపీ లో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

మాజీ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ఇవాళ చెన్నై లో కేంద్ర మంత్రి,...

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపినట్లు సమాచారం (Telangana...

నిడదవోలు జనసేన MLA అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్

జనసేన మరో MLA అభ్యర్థిని ప్రకటించింది. జనసేన, టీడీపీ, బీజేపీ, కూటమిలో భాగంగా నేడు నిడదవోలు (Nidadavole) అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్ధిగా...

నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం...

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి తొలగించాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

బీఆర్ఎస్ పార్టీకి షాక్… నాగర్‌కర్నూల్ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు (Nagarkurnool MP Ramulu...

తెలంగాణలో 17 ఎంపీ స్థానాలలో గెలవడమే బీజేపీ లక్ష్యం: కిషన్ రెడ్డి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గరవుతున్న తరుణంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు...