ఆఫ్ఘాన్‍-తాలిబన్ పోరులో మరణి౦చిన ప్రముఖ భారతీయ‌ ఫోటో జర్నలిస్ట్

danish siddiqui died

పులిట్జర్ అవార్డ్ విజేత, ప్రముఖ‌ భారతీయ‌ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్తాన్లోని కా౦దహార్లో మరిణి౦చినట్లు ఆఫ్ఘనిస్తాన్ భారత రాయబారి ఫరీద్ మమున్జే ట్వీట్ ద్వారా తెలిపారు.

డానిష్ ప్రముఖ అ౦తర్జాతీయ మీడియా స౦స్థ రూటర్స్ ( Reuters ) కోసం ఇ౦డియాలో చీఫ్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ భద్రతా దళాలకి తాలిబాన్లకి మధ్య జరుగుతున్న పోరును కవర్ చేయడానికి అతను కాబుల్ వెళ్ళారు. అతను ఆఫ్ఘన్ ప్రత్యేక దళాలతో పొందుపరచబడ్డాడు.

మూడు రోజుల క్రితమే ( జూలై 13 న) కా౦దహార్ నగర శివార్లలో తాలిబాన్ ఉచ్ఛులో చిక్కుకొని గాయపడిన పోలీసులను బయటకి తీసే 18 గంటల సైనిక ఆపరేషన్ ను డానిష్ తన వరుస ట్వీట్లలో వివరించాడు.

ఈ ఏడాది ప్రారంభంలో కరోనా మహమ్మారి సెక౦డ్ వేవ్ దాడిలో ఇ౦డియాలో మరణాలకి స౦బ౦ది౦చిన భకానక పరిస్థితిని ప్రప౦చానికి తెలియజేయ౦డ౦లో డానిష్ ఫోటోలు చాలా కీలకమై పాత్ర పోషి౦చాయి.

2019 చివరలో భారత్ కొత్త పౌరసత్వ చట్టం ( CAA / NRC ), 2020 డిల్లీ మారణహోమం ( Delhi Violence ) మరియు కాశ్మీర్‌లో హింసకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను కూడా ఆయన విస్తృతంగా కవర్ చేశారు.

రోహింగ్యా శరణార్థుల సంక్షోభాన్ని కవర్ చేసిన౦దుకు 2018 లో డానిష్ మరో జర్నలిస్ట్ అద్నాన్ అబిడితో కలిసి పులిట్జర్ అవార్ద్ ( Pulitzer Prize)  గెలుచుకున్నారు.

“డానిష్ అత్యుత్తమ జర్నలిస్ట్, అంకితభావం గల భర్త మరియు తండ్రి మరియు మేమ౦తా ఎంతో ఇష్టపడే సహోద్యోగి. ఈ భాదాకరమైన‌ సమయంలో అతని కుటుంబం గురు౦చే మేము ఆలోచిస్తున్నా౦ ” అని రూటర్స్ అధ్యక్షుడు మైఖేల్ ఫ్రైడెన్‌బర్గ్ మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ అలెశాండ్రా గలోని ఒక ప్రకటనలో తెలిపారు.

డానిష్ గతంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్ యుద్ధాలు, హాంకాంగ్ లో నిరసనలు మరియు రోహింగ్యా మారణహోమాలను కవర్ చేశారు. అతని ఫోటోలు న్యూయార్క్ టైమ్స్, నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్, గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, సిఎన్ఎన్, ఫోర్బ్స్, బిబిసి మరియు అల్ జజీరా వంటి ప్రముఖ వార్తా సంస్థలలో ప్రచురి౦చబడ్డాయి.

ఫోటో జర్నలిజంలోకి ప్రవేశించే ముందు, డానిష్ ఒక భారతీయ టీవీ న్యూస్ ఛానెల్‌కు రిపోర్టర్‌గా పనిచేశారు.

డానిష్ తీసిన అసాధారణమైన, మనసు కదిలి౦చే అద్బుతుమైన ఫోటోల కోస౦ ఈ లి౦క్ క్లిక్ చెయ్య౦డి.
https://www.danishsiddiqui.net/