AFG vs BAN: ఆఫ్ఘనిస్తాన్ ఇన్… ఆస్ట్రేలియా అవుట్

Date:

Share post:

AFG vs BAN: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మరియు బాంగ్లాదేశ్ (Afghanistan vs Bangladesh) మధ్య జరిగిన మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయ కేతనం ఎగరవేసింది. ఈ మ్యాచ్ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమి-ఫైనల్స్ కు (Afghansitan enters Semi Finals) చేరుకోగా… బాంగ్లాదేశ్ మరియు ఆస్ట్రేలియా (Bangladesh and Australia Knocked Out) గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి.

ముందుగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాట్టింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో గుర్బాజ్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా … మిగిలిన వారెవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.

బంగ్లా బౌలర్లలో రిషద్ 3 వికెట్లు తీసుకోగా …. ముస్తాఫిజుర్ మరియు తస్కిన్ చెరొక వికెట్ దక్కించుకుని ఆఫ్ఘన్ ను తక్కువ స్కోరుకే కట్టడి చెయ్యడంలో సఫలం అయ్యారనే చెప్పుకోవాలి.

కేవలం 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టును ఆఫ్ఘనిస్తాన్ 105 పరుగులకే కట్టడిచేసి విజయాన్ని (DLS Method) సొంతం చేసుకుంది. ఒకపక్క వికెట్లు కోల్పోతున్నా బాంగ్లాదేశ్ జట్టును గెలిపించడానికి ఓపెనర్ లిటన్ దాస్ విశ్వప్రయత్నం చేసాడు. అయితే మిగిలిన బ్యాటర్లు ఎవరు తనకి సహకరించకపోవడంతో బాంగ్లాదేశ్ ఓటమి చవిచూడక తప్పలేదు.

చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సూపర్ 8 మ్యాచ్ లో విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమిస్ లో చోటు సంపాదించుకుంది. అయితే ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి భారత్ నాక్ అవుట్ కు చేరిన విషయం తెలిసిందే.

దీనితో సెమి-ఫైనల్స్ లో ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా అలాగే భారత్ మరియు ఇంగ్లాండ్ తలపడనున్నాయి.

మ్యాన్ అఫ్ ది మ్యాచ్: నవీన్ ఉల్ హక్

సెమిస్ కు చేరిన ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan Enters Semi Finals):

ALSO READ: WI vs SA: ఉత్కంఠ పోరు లో దక్షిణాఫ్రికా గెలుపు

Newsletter Signup

Related articles

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...

ఫైనల్ కు భారత్… సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం

IND vs ENG: టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup 2024) భాగంగా గయానా వేదికగా నిన్న భారత్ మరియు ఇంగ్లాండ్...

WI vs SA: ఉత్కంఠ పోరు లో దక్షిణాఫ్రికా గెలుపు

టీ20 ప్రపంచ కప్ 2024 లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు జరిగిన వెస్ట్ ఇండీస్ వైస్ దక్షిణాఫ్రికా మ్యాచ్...

T20 WC 2024 IND vs AUS: నేడు ఆస్ట్రేలియా తో తలపడనున్న భారత్

IND vs AUS: టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) లో భాగంగా సెయింట్ లూసియా స్టేడియం వేదికగా నేడు...

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...

Riyan Parag: వరల్డ్ కప్ చూడాలని లేదు: రియాన్ పరాగ్

టీం ఇండియా యువ క్రికెటర్ రియాన్ పరాగ్ టీ౨౦ వరల్డ్ కప్ పై సంచలన వ్యాఖ్యలు (Riyan Parag Comments on T20...