ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం లో జరిగిన విజన్ విశాఖ సదస్సులో భాగంగా సీఎం జగన్ (CM Jagan) మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్ర రాజధానిగా (AP capital Visakhapatnam) విశాఖ ఉండనున్నట్లు తెలిపారు.
రానున్న ఎన్నికల్లో గెలిచి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని. అనంతరం ఈ విశాఖ నుంచే పాలన సాగిస్తానని తెలిపారు. అలాగే విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నామని… ఈ నగరాన్ని ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్‌గా మారుస్తామని జగన్ స్పష్టం చేశారు.
ఇకపోతే విశాఖను రాజధానిగా ప్రకటించడం పట్ల ఎలాంటి వ్యక్తిగత స్వార్ధం లేదు. విశాఖ అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ కంటే గొప్పగా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతి లో కనీసం మౌలిక సదుపాయాలు లేవని సీఎం అని జగన్ పేర్కొన్నారు.
ఏపీ రాజధానిగా విశాఖ (Visakhapatnam as AP Capital- CM Jagan):
ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ. ఇక్కడే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తాను. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటా. -సీఎం జగన్#BreakingNews #TeluguNews
— NTV Breaking News (@NTVJustIn) March 5, 2024
This is my Commitment to Vizag🔥
మళ్లీ గెలిచి వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తా
వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచి పాలన సాగిస్తా
-సీఎం వైయస్ జగన్#VisionVisakha#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/PX1vT2Byo3
— YSR Congress Party (@YSRCParty) March 5, 2024
అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళ్తోంది
ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉంది
దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి
-సీఎం @ysjagan #VisionVisakha#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/yfw7RDBHgC
— YSR Congress Party (@YSRCParty) March 5, 2024
ALSO READ: YSRCP: వైసీపీ తొమ్మిదవ జాబితా విడుదల