Balakrishna AP Assembly: ఏపీ లో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో తెలుగు దేశం హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం మెలేసినట్లు వై.ఎస్.ఆర్.సి.పి శ్రేణులు ఆరోపించగా స్పీకర్ తమ్మినేని బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చినట్లు మీడియా సమాచారం. అయితే బాలకృష్ణ మీసం తిప్పినట్లు ఎలాంటి వీడియో ఫుటేజ్ లో కనిపించలేదు.
ఈ సభలో మీసాలు మెలేయడం సబబు కాదని… సభ సంప్రదాయాను తప్పకుండ పాటించాలి అని స్పీకర్ తెలిపారు. అయితే ఇది, సభలో జరిగిన మొదటి తప్పిదంగా భావించి క్షమిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
14 మంది తెదేపా ఎమ్మెల్యేలు సస్పెండ్:
ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మొదలైన మొదటి రోజు. ఈ సమావేశంలో టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్టు గురించి చర్చించాలి అని పట్టుపట్టారు. అనంతరం స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులతో నినాదాలు చేశారు.
మరోపక్క అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ తమ్మినేని పోడియంను చుట్టుముట్టిన 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలని ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఈ రోజు సస్పెండ్ అయిన 14 మంది టీడీపీ సభ్యులలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, బాలవీరాంజనేయ స్వామి, శ్రీదేవి, అశోక్, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, వెంకట రెడ్డి నాయుడు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు ఉన్నట్లు సమాచారం.
ALSO READ: జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయి: పవన్ కళ్యాణ్