సౌత్ ఇ౦డియన్ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ ను పలు వివాదాలు చుట్టిముట్టాడుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకెళ్తున్న ఈ సినిమాను అదే స్థాయిలో వివాదాలు కూడా తలెత్తుతున్నాయి.
ఈ సినిమాలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. జై భీమ్ చిత్ర నిర్మాత, దర్శకుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు.
అక్కడితో ఆగకు౦డా… వన్నియార్ కమ్యూనిటీని కించపరిచిన నటుడు సూర్య ని కొట్టిన వారికి లక్ష రూపాయిలు బహుమానాన్ని ఇస్తామ౦టూ పీఎంకే నేతలు ప్రకటించినట్లు మీడియా వర్గాల సమాచార౦. రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంఘం నోటీసులు కూడా జారీ చేసింది.
అయితే అభిమానులు, సినిమా ప్రేమికులు, పలువురు ప్రముఖులు కూడా సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు. #WeStandWithSuriya అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అయినట్లు తెలుస్తో౦ది.
ఈ వివాద౦పై సూర్య స్ప౦దిస్తూ… తమది దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే, అంతేకాని తమ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు.