Andhra Pradesh Deputy Collectors Transfer: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ జిల్లాలో పనిచేస్తున్న 60 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయడం జరిగింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ కనుక వస్తే బదిలీలు చేసేందుకు అవకాశం ఉండదు కనుక ముందస్తు చర్యగా ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు ఈ వార్త ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh Deputy Collectors Transfer:
అమరావతి: భారీగా ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. 60 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.#Andhrapradesh #TeluguNews
— NTV Breaking News (@NTVJustIn) October 19, 2023