ప్రముఖ సీనియర్ సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద కనిపించడం లేదు (Jayaprada Missing). ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ వార్త సామజిక మాధ్యమం అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ అసలు ఏమైందంటే… 2019 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించారని ఆమె పై రెండు కేసులు నమోదు అయినందున ఆమె కోర్టులో విచారణ ఎదురుకుంటోంది.
అయితే ఇప్పటివరకు ఆమె విచారణకు హాగరు కాలేదని సమాచారం. న్యాయమూర్తి జయప్రదను కోర్టుకి రావాలంటూ ఎన్నిసార్లు ఆదేశించినా ఆమె లెక్కచేయకపోవడంతో న్యాయస్థానం ఆమె పై నాన్ బెయిలబుల్ వారెంట్ అరెస్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణంగానే ఆమె ఎవరికి అందుబాటులో లేకుండా పోయిందని చర్చలు మొదలయ్యాయి.
జయప్రదని జనవరి 10లోపు కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయస్థానం పోలీసులకు ఆదేశించినట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు ఆమెను వెతికే పనిలో పడినట్లుగా తెలుస్తోంది.
ALSO READ: రాజీనామాపై తెలంగాణ గవర్నర్ తమిళిసై క్లారిటీ